Covid Drugs: చైనాలో మన మందులకు పెరిగిన డిమాండ్.. బ్లాక్‌లో కొంటున్న చైనీయులు

ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చైనాలో కోవిడ్ నివారణ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది కోవిడ్ యాంటీ వైరల్ మందుల కోసం నిరీక్షిస్తున్నారు. చాలా మంది బ్లాక్ మార్కెట్లో, ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు

Covid Drugs: చైనాలో మన మందులకు పెరిగిన డిమాండ్.. బ్లాక్‌లో కొంటున్న చైనీయులు

Covid Drugs: ప్రస్తుతం చైనా తీవ్రమైన కోవిడ్ సంక్షోభంతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చైనాలో కోవిడ్ నివారణ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే, అక్కడ డిమాండ్‌కు తగ్గట్లుగా మందుల సరఫరా లేదు. కొన్ని మందులకు మాత్రమే చైనా అనుమతించింది.

Russia: జీ7 దేశాలకు రష్యా షాక్.. ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేత

అవి కూడా కొన్ని ప్రధాన ఆస్పత్రుల్లోనే దొరుకుతున్నాయి. దీంతో చాలా మంది కోవిడ్ యాంటీ వైరల్ మందుల కోసం నిరీక్షిస్తున్నారు. చాలా మంది బ్లాక్ మార్కెట్లో, ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. అయినప్పటికీ మందులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియాలో తయారైన జెనరిక్ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మన దేశంలో తయారైన మందులు కోవిడ్ నియంత్రణలో సమర్ధంగా పని చేసిన సంగతి తెలిసిందే. అందుకే వీటిపై అక్కడివాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైమవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ వంటి పేర్లతో మన కోవిడ్ మందుల్ని చైనాలో అక్రమంగా విక్రయిస్తున్నారు.

Tamil Nadu: చైనా నుంచి తమిళనాడు వచ్చిన తల్లీకూతురుకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

ఎందుకంటే వీటికి చైనా ప్రభుత్వం అనుమతించలేదు. అక్కడ రెండు మందుల్ని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో భారతీయ ఔషధాల్ని అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇది అక్కడ చట్టప్రకారం నేరం. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో లేబుల్స్ మార్చి విక్రయిస్తున్నారు. ఈ మందులకు సంబంధించిన ఫొటోలు అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇలా అక్రమ మార్గంలో మందులు కొనొద్దని పౌరులకు ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. చైనా నుంచి చాలా మంది మన మందుల కోసం సంప్రదిస్తున్నట్లు ఫార్మా సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు.

ఇబూప్రొఫెన్, పారాసిటమాల్ వంటి మందుల కోసం కూడా చైనా నుంచి అడుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే, విదేశాల్లో డిమాండ్‌కు తగ్గట్లుగా మందులు ఉత్పత్తి చేసేందుకు మన సంస్థలు రెడీ అవుతున్నాయి.