PM Modi : ప్రధాని మోదీపై లాలూ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....
- saleem sk
- Published On : July 31, 2023 / 05:37 AM IST
Lalu Prasad,PM Modi
PM Modi will settle abroad : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు. (after losing 2024 Lok Sabha elections) ఎన్నికల్లో ఓటమి తర్వాత మోదీ విదేశాల్లో ఆశ్రయం కోసం వెతుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. (PM Modi will settle abroad)
Air India flight : ఎయిర్ ఇండియా విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొత్త కూటమి ఇండియాను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోదీ చేసిన క్విట్ ఇండియా వ్యాఖ్యలపై లాలూ స్పందించారు. (Lalu Prasad) మోదీ ఓటమి అనంతరం దేశాన్ని వదిలేసే ఆలోచనలో ఉన్నారని, అందుకే ప్రధాని విదేశాలను సందర్శిస్తున్నారని చెప్పారు.
Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
విదేశాల్లో పిజ్జాలు, మెమోస్, చౌ మెయిన్ లను అస్వాదించగల ప్రదేశాన్ని మోదీ వెతుకుతున్నారని లాలూ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కోలుకొని బ్యాడ్మింటన్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించిన లాలూ మోదీపై విమర్శలు కురిపించారు.
