Punjab Cm met Pm Modi: పంజాబ్ కాంగ్రెస్‌లో క్రైసిస్.. ప్రధాని మోదీతో కొత్త సీఎం చన్నీ భేటీ..!

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని.. విజ్ఞప్తి చేశారు.

Punjabcm

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని.. విజ్ఞప్తి చేశారు. పంజాబ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ప్రధానిని చన్నీ కలవడం ఇదే ఫస్ట్ టైమ్.

సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులతో చర్చల ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని.. వివాదాస్పదమైన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేశానని చరణ్ జిత్ సింగ్ చెప్పారు. అలాగే.. కోవిడ్ ప్రభావంతో మూసివేసిన కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఈ భేటీ సందర్భంగా.. ప్రధానికి కానుకలను అందించి సత్కరించారు చన్నీ.

ఓ ముఖ్యమంత్రి.. ప్రధానిని కలవడం.. తన రాష్ట్ర సమస్యలు తెలపడంలో వింతేమీ లేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో అస్తవ్యస్తంగా మారిన రాజకీయ పరిస్థితులు.. సీఎంగా అమరీందర్ రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఆ వెంటనే పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో అమరీందర్ సింగ్ భేటీ వంటి పరిణామాల తర్వాత.. చన్నీ.. నేరుగా వెళ్లి ప్రధాని మోదీని కలవడాన్ని మాత్రం అందరూ కాస్త ప్రత్యేకంగానే చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దిల్లీ పర్యటనలో ఉన్న చన్నీ.. పార్టీ అధిష్టాన పెద్దలను సైతం కలిసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మరోసారి వివరిస్తారని తెలుస్తోంది.