రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గుర్తుపట్టగలరా..

Royal Enfield Continental GT 650: ప్రపంచంలోనే పాత మోటర్ సైకిల్ బ్రాండ్ ఇంకా ప్రొడక్షన్‌లోనే ఉంది. పాపులర్ బ్రాండ్‌లో ఒకటైన రెట్రో మోటార్ సైకిల్ రెండేళ్ల క్రితమే ట్విన్ సిలిండర్లతో మరో మోడల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మరో ఏ Royal Enfield లేనంతగా.. Interceptor 650, Continental GT 650ని కస్టమర్లు యాక్సెప్ట్ చేశారు.

వీటిల్లో ప్రత్యేకతమేమిటంటే.. ట్విన్ సిలిండర్లతో డిజైన్ కావడమే. క్లాసిక్ 350, బుల్లెట్, ఇంటర్‍‌సెప్టార్, కాంటినెంటల్ జీటీ 650లు అన్నీ మాడిఫికేషన్ కు భళే అనుకూలిస్తాయి. అటువంటి వాటిల్లోనే కొత్త ప్రయోగం ( రీ మోడలింగ్ బైక్) గురించి చూస్తే..

గోబిన్ వర్క్స్ గ్యారేజిలో ఓ టీవీ షో కోసం దీనిని మాడిఫై చేశారు. కాంటినెంటల్ జీటీ 650లో మార్పులు చేసి లుక్ ను పూర్తిగా మార్చేశారు. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనకు కావాల్సిన మార్పులు ఏవైనా సింపుల్ గా చాలా త్వరగా చేసేయొచ్చు.

ఈ బాడీ లుక్ చూస్తే రేసింగ్ బైక్ గుర్తు వస్తుంది. కార్బన్ ఫైబర్ మెటేరియల్‌తో బైక్ రెడీ అయింది. ఇక దీని ఫ్యూయెల్ ట్యాంక్ ను కూడా రేస్ లిఫ్ట్ క్యాప్ లాగే డిజైన్ చేశారు. మోనో యూనిట్ ను మార్చి రెండు షాక్ అబ్జార్బర్లు ఫిట్ చేశారు. వెనక చక్రానికి మోనోషాక్ కోసం స్విన్ గార్మ్‌ను ఫ్యాబ్రికేట్ చేయించారు. అలా ముందు వెనుక సస్పెన్షన్ కు ఉపయోగపడుతుంది.


ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ కు జీపీ స్టైల్ క్విక్ రిలీజ్ యాక్సిల్ తో ఉంది. ఈ చక్రాలు కార్బన్ ఫైబర్ యూనిట్స్ అన్నమాట. నికెల్ ప్లేట్‌లతో పాటు గాల్ఫర్ డిస్క్‌లు ప్లాన్ చేసి బ్రేక్ సిస్టమ్ సూపర్ గా మార్చేశారు. వెనుక వైపు విశాలమైన టైర్ తో మార్చారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, హ్యాండిల్ బార్స్, హైడ్రాలిక్ క్లచ్ బైక్ ను పట్టుకున్నా.. చూసినా స్పెషల్ ఫీలింగ్ తెప్పిస్తున్నాయి.

royal enfield 650

ట్రెండింగ్ వార్తలు