Uttarakhand disaster: ఉత్తరాఖాండ్ బీభత్సం ఘటనలో వరుసగా పదో రోజు 2మృతదేహాలు లభ్యమయ్యాయి. తపోవన్ టన్నెల్ నుంచి మంగళవారం దొరికిన 2శవాలతో కలిపి 58కి చేరాయి. చమోలీ డిజాష్టర్ ఫలితంగా ఇంకా 148మంది ఆచూకీ తెలియకుండానే ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్స్ తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్ట్ సైట్ వద్ద ఇప్పటి వరకూ 11మంది డెడ్ బాడీలను రికవరీ చేశారు.
చమోలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జీఎస్ రానా.. దీనిపై వీడియో స్టేట్ మెంట్ ఒకటి రీలీజ్ చేశారు. ఈ ఘటన కారణంగా.. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. కొందరి ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లిపోయి హాస్పిటల్ పాలైయ్యారు. ఫిబ్రవరి 16 వరకూ లభ్యమైన 58మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. వారందరూ కూడా ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండెంట్ పీకే తివారీ మాట్లాడుతూ.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చివరి బాధితుడి ఆచూకీ దొరికే వరకూ కొనసాగుతూనే ఉంటాయి. సొరంగం మొత్తం వెదకాలంటే నెలల సమయం కూడా పట్టొచ్చు. మిస్సింగ్ అయిన వారి గురించి తెలిసే అవకాశాలు.. కచ్చితంగా చెప్పలేం. అద్భుతాలు జరిగితే సాధ్యపడొచ్చు.