పంత్ పెద్ద మనస్సు: ఉత్తరాఖాండ్ బాధితులకు విరాళంగా మ్యాచ్ ఫీజు

Uttarakhand Glacier Burst: ఇండియన్ వికెట్ కీపర్ – బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. ఉత్తరాఖాండ్ ఘటన బాధితులకు తన వంతు సహాయంగా మ్యాచ్ ఫీజును విరాళమిచ్చాడు. చెన్నై వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనపై పంత్ ఫీలింగ్ ను ట్వీట్ రూపంలో వెల్లడించాడు.

ఉత్తరాఖాండ్ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి చాలా ఫీలయ్యా. వీలైనంత మందికి సహాయపడదామనే ఉద్దేశ్యమంతో నా మ్యాచ్ ఫీజు విరాళమివ్వాలనుకుంటున్నా’ అని పంత్ ట్వీట్ చేశాడు.

మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కొద్ది పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అంతే కాకుండా చతేశ్వర్ పూజారాతో కలిసి ఐదో వికెట్ కు 119పరుగుల భాగస్వామ్యం నెలకొల్సాడు. మూడో రోజు ఆటముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసిన టీమిండియా 321 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో అశ్విన్​(8), వాషింగ్టన్​ సుందర్​(33) నిలిచారు.

ఘటనపై ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం త్రివేంద్ర రావత్.. రూ.4లక్షల రిలీఫ్ ను ప్రకటించారు. ప్రధాని మోడీ సైతం రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 100మంది ఆర్మీ పర్సనల్స్, ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్, ఐటీబీపీ నుంచి ఫస్ట్ బెటాలియన్ కు చెందిన 250మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.