×
Ad

Gaushala Dead Cows : యూపీ గోశాలలో ఆవుల మృతి..కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది....

  • Published On : June 30, 2023 / 02:18 PM IST

Gaushala Dead Cows

Gaushala Dead Cows : బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది. (Gaushala Dead Cows) ఆందోళన కలిగించే ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో జంతు సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు.

Manipur CM Biren Singh : నేడు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?

(Video shows dog eating dead cows) పశుసంవర్ధక శాఖ వైద్యులు ఇటావా జిల్లా గోశాలకు వచ్చి అనారోగ్యం పాలైన ఆవులకు చికిత్స అందించారు. (UP shelter)నాడా గ్రామంలోని గోశాలలో(Gaushala) అనారోగ్యంతో ఆవులు మరణించాయి. ఆవుల కళేబరాలను కుక్కలు వచ్చి పీక్కుతింటుండగా వైద్యులు గుర్తించారు.

Uniform Civil Code : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు

ఇటావా జిల్లాలో 76 గోశాలలు ఉండగా, 11,080 ఆవులున్నాయని పశువుల వైద్యుడు డాక్టర్ ఎంకే గుప్తా చెప్పారు. ఈ గోశాలల్లో ఒక్కో ఆవు ఆహారం కోసం రోజుకు రూ.30 అందజేస్తున్నారు. వర్షాకాలంలో ఆవులు అనారోగ్యానికి గురికాకుండా పరిశుభ్రత పాటించాలని వైద్యులు గోశాలల నిర్వాహకులకు సూచించారు.