arrested
Daughter Killed: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 58ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సుకురీ గిరీ అనే మహిళ కన్న కూతుర్నే చంపేందుకు రూ.50వేలు ఇచ్చి పురమాయించిందని పోలీసులు చెబుతున్నారు. సుకురీ గిరీ అనే మహిళ ప్రమోద్ జెనా(32) అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కిరాయి వ్యక్తులను మాట్లాడుకుంది. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
సుకురీ గిరీ కూతురు శిబానీ నాయక్(36)ను అంతమొందించాలనుకోవడంపై ప్రాథమిక విచారణలో ఇలా తేలింది. ఇద్దరి మధ్య జరుగుతున్న లిక్కర్ వ్యాపారంలో పొరపచ్చాలు రావడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. సుకురీ అక్రమంగా చేయాలనుకుంటున్న లిక్కర్ వ్యాపారానికి కూతురు అడ్డుతగుల్తుంది. అది నచ్చకపోవడంతో ప్రమోద్ జెనా అతని టీంను రూ.50వేలకు మాట్లాడుకుంది.
ఈ మేరకు కాంట్రాక్ట్ కిల్లర్ కు రూ.8వేలను అడ్వాన్స్ గా ఇచ్చింది. సుపారీ అందుకున్న నిందితులు జనవరి 12న శిబానీ నాయక్ ను రాళ్లతో, మరికొన్ని వస్తువులతో కొట్టి చంపేశారు. మృతురాలి దేహాన్ని నగ్రామ్ గ్రామంలోని బ్రిడ్జ్ కింద రికరవీ చేసుకున్నాట్లు అధికారులు వెల్లడించారు.