Pak Defence Minister
Pak Defence Minister: ప్రార్థనలు చేస్తున్న సమయంలో భారత్ లోనూ ఎన్నడూ భక్తులను ఎవరూ చంపలేదని, తమ దేశంలోని పెషావర్ లో మాత్రం మసీదులో ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని పాక్ రక్షణ శాఖ మంత్రి క్వాజా అసీఫ్ అన్నారు. పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మంది మృతి చెందగా, మరికొందరికి గాయాలైన విషయం తెలిసిందే. దీనిపై క్వాజా అసీఫ్ పాక్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు.
భారత్, ఇజ్రాయెల్ లోనూ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ప్రజలను ఎవరూ చంపలేదని, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెషావర్ లో మసీదులోని సెంట్రల్ హాలులో ఆత్మాహుతి దాడి జరిగిందని అసీఫ్ అన్నారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పనిచేయాల్సి ఉందని తెలిపారు. ఇటువంటి దాడులు జరగకుండా అప్పట్లో తాము పోరాటాన్ని ప్రారంభించామని, కానీ, గత ప్రభుత్వం దాన్ని అపేసిందని విమర్శించారు.
అఫ్గాన్ ప్రజలు పాక్ లోకి వచ్చి నివసించడం ప్రారంభించాక తమ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని అన్నారు. పెషావర్ లో ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని తమ దేశ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ పరిశీలించారని చెప్పారు. కాగా, మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటికే అధికారులు నిందితుడి పేరు మహ్మద్ అయాజ్ గా గుర్తించారు. ఆత్మాహుతి దాడితో అతడి శరీరం ముక్కలు ముక్కలైపోయింది. అతడి తలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Ala Vaikuntapuramlo : షెహజాదాకి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో.. వాళ్ళ సినిమాతో వాళ్ళకే ఎఫెక్ట్..