క్రికెటర్‌కి కరోనా.. నాకే ఎందుకిలా? అంటూ భావోద్వేగం
- vamsi
- Published on- May 8, 2020 / 07:59 AM IST
కరోనా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఈవెంట్లను ఇప్పటికే ఆపేసింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి లేటెస్ట్‌గా ఓ క్రికెటర్‌కి సోకింది. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన సోలో నిక్వెనీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇప్పటికే ‘గులైన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)’ అనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోలోకి లేటెస్ట్‌గా కరోనా పాజిటివ్ అని తేలింది.
కొద్ది రోజలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో నిక్వెనీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే నిక్వెనీకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో వచ్చింది. దీంతో కరోనా బారిన పడ్డ మూడో క్రికెటర్‌గా సోలో నిలిచాడు. అంతకు ముందు పాకిస్తాన్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్, స్కాట్లాండ్ క్రికెటర్ మజిద్ హక్‌కు కరోనా వచ్చింది.
Also Read | Coronavirus, Spanish fluను ఎదిరించిన 107ఏళ్ల మహిళ
అయితే తనకు కరోనా రావడంపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన సోలో భావోద్వేగానికి గురయ్యాడు. గతేడాది నాకు జీబీఎస్‌కు వచ్చింది. పది నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా. దాదాపు సగం కోలుకున్నా. టీబీ వచ్చింది, మూత్రపిండాలు, కాలేయం పాడయ్యాయి. ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. నాకే ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సోలో.
నిక్వెనీ 2012లో దక్షిణాఫ్రికా అండర్-19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఈస్ట్రెన్ ప్రావిన్స్, వారియర్స్ ప్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాడు. ప్రస్తుతం నిక్వెనీ అడేర్బీర్ షైర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు.
Also Read | క్రీడాకారులకు, ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆట మళ్లీ మొదలైంది
