Afghanistan : కాబుల్ లో బాంబు దాడి 14 మంది మృతి
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
- kunduru Vinod
- Published On : October 3, 2021 / 06:29 PM IST
Afghanistan (2)
Afghanistan : అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగినట్లు వెల్లడించారు.
Read More : Earthquake: జార్ఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదు
అఫ్ఘాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన నాటి నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆగస్టు నెలలో కాబుల్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడిలో 73 మంది మరణించగా.. వందమందికి పైగా గాయపడ్డారు. శనివారం జరిగిన కాల్పుల్లో ఓ జర్నలిస్టుతోపాటు మరో ముగ్గురు అఫ్ఘాన్ పౌరులు మృతి చెందారు.
Read More : Pokeman: పోక్‌మ్యాన్ గేమ్ ఆడండి.. జాబ్ సంపాదించండి
