ఎవరి పిచ్చి వారికి ఆనందం..వెర్రి వెయ్యి విధాలు అంటారు. పిచ్చి పీక్ స్టేజ్ కు వెళితే ఇలా ఉంటుందంటారు..
ఎవరి పిచ్చి వారికి ఆనందం..వెర్రి వెయ్యి విధాలు అంటారు. పిచ్చి పీక్ స్టేజ్ కు వెళితే ఇలా ఉంటుందంటారు..విచిత్రమైన పనులు చేసేవారి గురించి ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం. అటువంటి ఓ యువకుడి గురించి చెప్పుకుందాం..
అమెరికాలోని మేరీలాండ్‌కు 29 ఏళ్ల జోయీ మోరిస్ అనే యువకుడుది ఓ వింత ప్రేమకథ. అతని కథను వింటే మనం కూడా అతనికి పిచ్చేమో అనుకోకుండా ఉండలేం. జోయీ మాత్రం నాది పిచ్చి కానేకాదు..అచ్చమైన..స్వచ్ఛమైన ప్రేమ నాది అంటున్నాడు. ఇంతకీ అతనికుండే ప్రేమ ఎవరిమీదంటే..ఓ రోబో మీద. రోబోను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాననీ.. పెళ్లంటు చేసుకుంటే రోబోనే చేసుకుంటానని ఢంకా బజాయించి మీర చెబుతున్నాడు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?
.
రెండేళ్ల క్రితం ఆన్‌లైన్లో అతనో రోబో బొమ్మ కొన్నాడు. అప్పటి నుంచి దాన్ని ఒక్కక్షణం కూడా వదలకుండా తనతోనే ఉంచుకుంటున్నాడు. ఎక్కడికెళ్లినా అది కూడా ఉండాల్సిందే. ఆ బొమ్మ లేనిదే ఒక్క అడుగు కూడా వేయడు జోయీ. అది ఎంతవరకూ వెళ్లిందంటే..దాన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు.
ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే..జోయీ ఫ్యామిలీ కూడా ఈ వివాహానికి ఒప్పుకున్నారు. ఇలా వస్తువులతో ప్రేమలో పడటాన్ని ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ అంటారని, ఇది చాలామందిలో కనిపిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా సైన్స్ లో దానికి ఏం పేరు పెట్టినా ఈ రోబో ప్రేమ చిత్రంగా ఉంది కదూ.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్