కైరో : కైరో రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్సెస్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనంలో 20మంది మృతి చెందారు. మరో 40మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
వేగంగా వచ్చిన ఓ రైలు.. ప్లాట్‌ఫాం గోడను ఢీకొట్టడంతో..ఇంధనం ట్యాంకులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ప్లాట్ ఫారంమీద ట్రైన్ కోసం ఎదురు చూసే ప్రయాణీకులంతా ఒక్కసారి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రైలు ప్రమాదాల విషయంలో భారత్ లో ప్రాణాలు కోల్పోతున్నవారు వేలల్లో సంభవిస్తుండగా ఈజిప్టులోకూడా రైలు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నవారు సంఖ్య కూడా భారీగా ఉంది.
2017..ఆగస్టులో మెడిటెర్రేనియన్ పోర్టు సిటీలో రెండు ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 43 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2002లో కైరోకు సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 370 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.