×
Ad

24 Carat Gold Biscuits: ఇలాంటి ఆఫర్లు మనకి తగలవెందుకో.. పెళ్లికొచ్చిన వాళ్లకి 24 క్యారెట్ బంగారం బిస్కెట్లు?

గోల్డ్ బిస్కెట్లు కానుకగా ఇవ్వడం ఏంటి అని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఇది కలా నిజమా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

  • Published On : February 15, 2026 / 06:30 AM IST

24 Carat Gold Biscuit Representative Image (Image Credit To Original Source)

  • అవి 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్లు కాదు
  • గోల్డ్ కలర్ పేపర్ చుట్టిన లగ్జరీ చాక్లెట్లు
  • ప్రీమియం చాక్లెట్ బ్రాండ్ పాచి (Patchi) ఉత్పత్తులు
  • పెళ్లి వేడుకల్లో గెస్టులకు ఈ చాక్లెట్లు ఇవ్వడం చాలా కామన్

24 Carat Gold Biscuits: 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్లు బహుమతులుగా ఇచ్చినట్లుగా చూపించిన 33 సెకన్ల వెడ్డింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అయ్యింది. సౌదీ అరేబియాలో ఒక పెళ్లి వేడుకలో బంగారు బిస్కెట్లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

అదొక వివాహ వేడుక. కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉంటారు. వారి దగ్గరికి ఒక వ్యక్తి పెట్టెతో వస్తాడు. ఆ పెట్టెలో ధగధగ మెరిసిపోయే 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్లను తలపించేవి ఉన్నాయి. ఆ వ్యక్తి పెట్టె తీసుకుని ఒక్కో గెస్ట్ దగ్గరకి వెళ్తాడు. వారు అందులోంచి ఒక్కో గోల్డ్ బిస్కెట్ ను చేతికి తీసుకోవడం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెట్టె పట్టుకున్న వ్యక్తి వధువు సోదరుడు అని, వరుడి కుటుంబసభ్యులకు కానుకగా అతడు గోల్డ్ బిస్కెట్లు ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది.

ఇది అందరినీ షాక్ కి గురి చేస్తోంది. గోల్డ్ బిస్కెట్లు కానుకగా ఇవ్వడం ఏంటి అని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఇది కలా నిజమా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. పెళ్లికి వచ్చిన గెస్టులకు గోల్డ్ బిస్కెట్లు కానుకగా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు, వాళ్లు చాలా రిచ్ అయి ఉంటారు అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

అయితే, ఇందులో అసలు నిజం ఏంటంటే.. వీడియోలో చూపించిన గోల్డ్ బార్స్ రియల్ గోల్డ్ కాదు. ఈ నిజం తెలిశాక అంతా డబుల్ షాక్ కి గురయ్యారు. మెరిసేదంతా బంగారం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

గోల్డ్ బిస్కెట్ కాదు జస్ట్ చాక్లెట్..!

అసలు నిజం ఏంటంటే.. అవి గోల్డ్ బిస్కెట్లు కానే కావు. అవి చాక్లెట్లు. బంగారు బిస్కెట్లుగా కనిపించినవి నిజానికి బంగారు రంగు రేకులో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇదే పచ్చి నిజం. ఇవి బులియన్‌ను పోలి ఉండేలా రూపొందించారు. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో వివాహాలు, వేడుకల్లో సాధారణంగా మార్పిడి చేసుకునే బంగారు చుట్టిన ప్రీమియం చాక్లెట్ బ్రాండ్ పాచి (Patchi) ఉత్పత్తులు.

ఊహాగానాలు పెరగడంతో ఒక వినియోగదారుడు గ్రోక్‌ను “ఫుటేజ్ నిజమైందా కాదా” అని అడిగాడు. ఆ ఈవెంట్ నిజమైనదే. సౌదీ నుండి వచ్చింది. కానీ అవి 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్లు కావు, గోల్డ్ కలర్ పేపర్లు చుట్టిన చాక్లెట్లు అని స్పష్టం చేసింది. వెడ్డింగ్ ఈవెంట్ లో గెస్టులకు 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం అని గ్రోక్ తేల్చింది.

”ఈ వీడియో సౌదీలో జరిగిన ఒక ఈవెంట్ నుండి వచ్చిన నిజమైన ఫుటేజ్. కానీ ఆ “24-క్యారెట్ల బంగారు బిస్కెట్లు” నిజానికి పాచీ బ్రాండ్ నుండి వచ్చిన లగ్జరీ చాక్లెట్లు. బంగారు కడ్డీల వలె కనిపించేలా బంగారు రేకుతో చుట్టబడి ఉంటాయి. వాటిని సాధారణంగా అక్కడి వివాహ వేడుకల్లో గెస్టులకు గిఫ్ట్ గా ఇస్తారు” అని గ్రోక్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

Patchi Representative Image (Image Credit To Original Source)

ఆ పెట్టె మొత్తం విలువ 50 డాలర్ల కంటే తక్కువే ఉంటుంది. అసలు బంగారంతో దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఒక నెటిజన్ తెలిపారు. హై-ప్రొఫైల్ ఈవెంట్లలో విలాసవంతమైన విజువల్ ఎఫెక్ట్‌ను సృష్టించడానికి ఇటువంటి విలాసవంతమైన మిఠాయిలను తరచుగా వాడతారని వివరించారు.

పెళ్లి వేడుకలో అతిథులకు 24 క్యారట్ గోల్డ్ బిస్కెట్లు గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా వీడియో చూసి అంతా అవాక్కయ్యారు. వావ్ సూపర్, ఇది ఏమన్నా ఆఫరా? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు మన దగ్గర తగలవు ఎందుకో అని కొందరు తెగ ఫీలయ్యారు. కట్ చేస్తే.. అసలు నిజం తెలిశాక నవ్వు ఆగడం లేదు. అవి గోల్డ్ బిస్కెట్లు కాదు.. గోల్డ్ కలర్ పేపర్ చుట్టిన చాక్లెట్లు అని తెలిసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తాయంటే ఇదేనేమో, మెరిసేదంతా బంగారం కాదు అని పెద్దలు అన్నది ఇందుకేనేమో, ఏదీ నిర్ధారణ చేసుకోకుండా చూసిందల్లా గుడ్డిగా నమ్మేయడం కరెక్ట్ కాదని జనాలు అనుకుంటున్నారు.