Nepal Earthquake: భయంతో వణికిపోతున్న నేపాల్.. మొన్న వరదలు.. ఇప్పుడు భూకంపం.. 3.8 తీవ్రత

ఆదివారం సాయంత్రం నేపాల్‌లో మరోసారి భూమి(Nepal Earthquake) కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో సంభవించింది.

3.8 magnitude Earthquake shakes Nepal.

  • నేపాల్ లో భూకంపం
  • రిక్టర్ స్కెల్ పై 3.8 తీవ్రత
  • భయాందోళనలో ప్రజలు

Nepal Earthquake: ఆదివారం సాయంత్రం నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో వచ్చిన ఈ స్వల్ప భూకంపం (Nepal Earthquake)భూమికి 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తీవ్ర వైపరీత్యంతో అల్లాడుతున్న వేళ మళ్లీ భూకంపం రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

NTR Bharosa Pension: ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. కావాల్సిన సర్టిఫికేట్లు ఇవే!

ఆగస్టు వరదల సృష్టించిన విధ్వంసం.. శవాల దిబ్బగా గ్రామాలు:

ఆగస్టు 26న సంభవించిన భయంకర వరదల వల్ల ఇప్పటివరకు 1,344 మంది మృతి చెందగా, మరో 5,000 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు సహాయక బృందాలు 13,100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం, గల్లంతైన వారి కోసం తీవ్ర స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఆగస్టు 27న కూడా 3.2 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.