Woman Tries Open Plane Door At 37,000 feet : ‘దేవుడు పిలుస్తున్నాడు’..అంటూ 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానం డోరు తీయబోయిన మహిళ..

‘దేవుడు పిలుస్తున్నాడు’..అంటూ 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానం డోరు తీయబోయింది ఓ మహిళ..

Woman tries open plane door at 37,000 feet : అది టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌‌కు వెళుతున్న విమానం. 37,000 అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తోంది. ఇంతలో ఎవ్వరూ ఊహించని ఘటన జరిగింది. కాస్తలో తప్పింది..లేకుంటా ఆ విమానంలో ప్రయాణించేవారి పరిస్థితి ఎలా ఉండేదో..అసలు ఒక్కరైనా ప్రాణాలతో ఉండేవారా? అనే ఊహే వెన్నులోంచి వణుకు వచ్చేలా చేస్తోంది. విమానం 37,000 అడుగులో ప్రయాణిస్తుండగా…టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్‌ అగ్బెనినో అనే మహిళ ఆ విమానం ఎంట్రన్స్ డోరు తీసేందుకు యత్నించింది. ఆమెను గమనించి హడలిపోయిన తోటి ప్రయాణీకుడు..విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఆమెను అడ్డుకోవటంతో వెంట్రుకవాసిలో పెను ప్రమాదం తప్పింది. ఇటువంటి పరిస్థితుల్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

ఇంతకీ ఆమె ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్ అయ్యారు..‘దేవుడు నన్ను పిలుస్తున్నాడు..డోరు తీయమని చెప్పాడు’అంటూ చెప్పుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్‌ అగ్బెనినో అనే మహిళ ఒహైయోలోని కొలంబస్‌ వెళ్లేందుకు టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ విమానంలో బయల్దేరింది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్‌ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ వద్ద నిలబడి తదేకంగా డోర్ వంక చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని గౌరవంగా చెప్పారు. కానీ ఆమె వినలేదు. కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అయినా సిబ్బంది అంగీకరించలేదు. దయచేసి మీరు వెళ్లి మీ సీట్లో కూర్చోండి మాడమ్ అంటూ మరోసారి సూచించారు.

కానీ ఆమె వినలేదు. సిబ్బందిని నెట్టుకుంటూ డోర్ దగ్గరకు వెళ్లింది. ఎగ్జిట్‌ డోర్‌ హ్యాండిల్‌ పట్టుకుని తెరవటానికి యత్నించింది. ‘‘దేవుడు (ఏసు క్రీస్తు) నన్ను ఒహైయోకురమ్మన్నాడు. విమానం డోర్‌ తీయమని దేవుడే చెప్పాడు’’ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ డోర్ హ్యాండిల్ పట్టుకుని తెరవటానికి యత్నించింది. దీంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది క్షణంలో తేరుకుని ఆమెను ఆపారు. ఆ సమయంలో విమానం గాల్లో 37వేల అడుగుల ఎత్తులో ఉంది. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె గట్టిగా కొరికింది. దీంతో అతనికి గాయమైంది. అలా ఆమె నానా రచ్చా చేసింది.

ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్‌ అండ్‌ హిల్లరీ క్లింటన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జన్సీగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. తర్వాత ఆమెను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుతీ కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల విచారణలో అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహైయోకు బయల్దేరానని ఎలోమ్‌ పోలీసులు విచారణలో చెప్పింది. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని అందుకే ఇలా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు