Bus Accident : ఘోరప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 17మంది చిన్నారులు సహా 76 మంది మృతి

Bus Accident : అప్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 17మంది చిన్నారులు సహా 76మంది ..

Bus Accident : ఘోరప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 17మంది చిన్నారులు సహా 76 మంది మృతి

Bus Accident

Updated On : August 20, 2025 / 2:20 PM IST

Bus Accident : అప్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న బస్సులో (Bus Accident) మంటలు చెలరేగడంతో 17మంది చిన్నారులు సహా 76మంది మరణించారు.

 

పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన అఫ్గానిస్థాన్ వలసదారులతో బస్సు వెళ్తుంది. బస్సు అతివేగంగా వెళ్తుండటం కారణంగా ఓ బైక్ ను, ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఈ ఘటనలో 17మంది చిన్నారులు సహా 76 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయాలతో బయటపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు కూడా మరణించారు.


అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ ఘటనపై ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ప్రమాదంకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం అని పేర్కొన్నారు. ట్రక్కుతోపాటు బైక్ ను బస్సు ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయని తెలిపారు. మృతుల గుర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Delhi CM Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి.. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చి ఫడేల్మని చెంపపై కొట్టాడు.. అతడు చెప్పిన కారణం..