Google Data Centre: గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయం..! ఎందుకీ వివాదం? వైసీపీ వాదన ఏంటి?
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చినా సరే వైసీపీ కొట్టి పారేసింది.

Google Data Centre: ఏపీ డెవలప్‌మెంట్‌కు గేమ్‌ఛేంజర్. ఏకంగా లక్షా 80వేల ఉద్యోగాలు..ఒక లక్షా 30వేల కోట్ల పెట్టుబడులు. విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ ఏఐతో జరిగే ప్రయోజనం ఇదంటూ కూటమి చెప్పుకొస్తోంది. విపక్ష వైసీపీ రియాక్షన్ మాత్రం ఆసక్తికరంగా..పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. తమ హయాంలోనే అదానీతో ఒప్పందం చేసుకున్నామని చెప్తోంది వైసీపీ. గూగుల్ ఏఐతో పెద్దగా ఉద్యోగాలు రావని కూడా అంటోంది. గూగుల్ డేటా సెంటర్‌పై ఎందుకీ పొలిటకిల్ హైడ్రామా? ఏపీలో వైసీపీ ఇలా..కర్ణాటకలో మంత్రులు అలా..ఎందుకలా.?
విశాఖ గూగుల్ డేటా సెంటర్. ఇప్పుడిది ట్రెండింగ్ టాపిక్. పెట్టుబడుల పరంగా..అతిపెద్ద కంపెనీ విశాఖ వస్తున్న సందర్భంగా..ఇంట్రెస్టింగ్ అంశంగా నడుస్తోంది. సేమ్‌టైమ్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ కూడా అన్ని అంశాల లాగే..పొలిటికల్ టాపిక్‌గా..క్రెడిట్ వార్‌లో భాగంగా ఓ ఇష్యూ అయిపోయింది. ఓ వైపు ఏపీకి అతిపెద్ద పెట్టుబడి..దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు..లక్షా 30వేల కోట్ల పెట్టుబడులు అంటూ కూటమి చెబుతోంది. అందుకు తగ్గట్లే నేషనల్ హాట్ టాపిక్ అవుతోంది వైజాగ్ గూగుల్ డేటా సెంటర్. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఎడ్యుకేడెట్ సెక్టార్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయం రచ్చ చేస్తోంది. అటు కర్ణాటకలో గూగుల్ ఏఐ సెంటర్ చుట్టూ పొలిటికల్ దుమారం లేస్తోంది. సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్యూర్ వల్లే గూగుల్ ఏఐ సెంటర్ ఏపీకి తరలిపోయిందని అక్కడి ప్రతిపక్షాలు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. అయితే కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రయాంక్ ఖర్గే మాత్రం ఏపీ ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చుకుందని చెప్తున్నారు. అయినా బెంగుళూరే ఐటీ హబ్‌గా ఉందని అక్కడ ప్రభుత్వ పెద్దలు కవర్ చేసుకుంటున్నారు. ఏపీ మంత్రి లోకేశ్ మాత్రం ట్విట్టర్ వార్ కోసం కాదు..పెట్టుబడుల కోసమే తమ సిన్సియర్ ప్రయత్నమంటున్నారు.
డేటా సెంటర్లతో.. నీటి కొరత, కరెంట్ చార్జీలు పెంపు..?
ఇటు ఏపీలోనూ గూగుల్ డేటా సెంటర్ చుట్టే రాజకీయం నడుస్తోంది. గూగుల్ డేటా సెంటర్‌లో విపక్ష వైసీపీ రియాక్షన్..చర్చకు దారితీస్తోంది. వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్ గా పని చేసిన గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్ మెంట్‌పై డైలాగ్ వార్ నడుస్తోంది. డేటా సెంటర్లతో పెద్దగా ఉద్యోగాలు రావన్న ఆయన..గూగుల్ డేటా సెంటర్లతో నీటి కొరత వస్తుందని ఇంకో కామెంట్ చేశారు. అంతేకాదు కరెంట్ చార్జీలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. వైసీపీ తమ హయాంలోనే అదానీతో జగన్ ఇదే ఒప్పందం చేసుకున్నారని, ఇదేం కొత్తగా తెచ్చిందేం కాదని చెప్పుకుంటున్నారు. దీంతో వైసీపీ వాదనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కూడా దారితీస్తోంది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చినా సరే వైసీపీ కొట్టి పారేసింది. గూగుల్ నుంచి అధికారక ప్రకటన లేకుండా మీడియాలో ప్రచారం చేసుకుంటే వచ్చేసినట్లేనా అంటూ అప్పట్లో వైసీపీ లీడర్లు..సెటైర్లు వేశారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవడంతో..గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ రియాక్షన్ ఇంకా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కంపెనీ, ఎయిర్ టెల్ కూడా భాగస్వామ్యం అయ్యాయి. ఈ అంశాన్ని వైసీపీ అవకాశంగా అందిపుచ్చుకుంటుంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఒప్పందం కుదురిందని వైసీపీ గుర్తు చేస్తోంది. ఆ ఒప్పందమే కాస్త విస్తరించి గూగుల్ వరకు వెళ్లిందని చెప్పుకొస్తోంది. అప్పట్లో జగన్, అదానీ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.
సేమ్‌టైమ్ డేటా సెంటర్లతో పెద్దగా ఉపయోగం ఉండదని తీసి పడేస్తోంది వైసీపీ. డేటా సెంటర్లతో పర్యావరణానికి హాని కలుగుతుందని కూడా చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. దీంతో గూగుల్ డేటా సెంటర్‌ను వైసీపీ స్వాగతిస్తుందా? లేక వ్యతిరేకిస్తుందా? అన్న అంశంపై క్లారిటీ లేదన్న టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీ అధినేత జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: బీసీ రిజర్వేషన్ల అంశం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ