Telangana Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో ఆ నిబంధన ఎత్తివేత.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

రైతును రాజు చేసేందుకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులైనా ఎదుర్కొంటాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. వానా కాలంలో 1.48 లక్షలు మెట్రిక్

Telangana Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో ఆ నిబంధన ఎత్తివేత.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

Updated On : October 16, 2025 / 10:42 PM IST

Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రివర్గం నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలియజేశారు.

గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేదని, అంతకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేసే అర్హత ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. దీంతో వార్డు మెంబర్, సర్చంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఊరట లభించనుంది.

రైతును రాజు చేసేందుకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులైనా ఎదుర్కొంటాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. వానా కాలంలో 1.48 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని తెలిపారు. 80లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్ మెంట్ చేయాలన్నారు. కేంద్రం 50 లక్షల కంటే తీసుకోలేమని సూచనప్రాయంగా చెప్పిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. మద్దతు ధరతో పాటే బోనస్ 500 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..
* కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీలు
* కొడంగల్, నిజామాబాద్, హుజూర్ నగర్ లో కాలేజీలు ఏర్పాటు చేస్తాం
* డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు.. సబ్ కమిటీ ఏర్పాటు
* లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని నిర్ణయం
* ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ చేసుకోవచ్చు
* మెట్రోపై నివేదిక ఇచ్చేందుకు సీఎస్ చైర్మన్ గా అధికారుల కమిటీ
* 5,568 కిలోమీటర్లు 10,500 కోట్లతో హ్యాం రోడ్లకు కేబినెట్ ఆమోదం
* కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్ కు 438 కోట్లతో భూసేకరణకు ఆమోదం
* మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ హైలెవల్ కారిడార్ కు 7,500 కోట్లతో ఆమోదం

ఈ నెల 23 న కేబినెట్ మరోసారి భేటీ అవుతుందని.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కామెంట్స్ చూశాక.. వచ్చే కేబినెట్ లో చర్చిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Also Read: రసవత్తరంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం.. ప్రచారంలోకి ఆ ముగ్గురు బిగ్ పొలిటికల్ స్టార్లు..!