Best Camera 5G Phones : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!
Best Camera 5G Phones : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా రూ. 15వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Best Camera 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా అద్భుతమైన కెమెరా 5జీ ఫోన్లు డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫీచర్లతో 5జీ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. రూ. 15వేల లోపు ధరలో వివో T4x 5G నుంచి రియల్‌మి వరకు అనేక స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

1. వివో T4x 5G : వివో T4x 5G ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్‌తో అద్భుతమైన ఫొటోగ్రఫీని పొందవచ్చు. ఈ వివో ఫోన్ 6500mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ వివో ఫోన్ ఏడాది వారంటీ, అప్లియన్సెస్ 6 నెలల వారంటీ లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 25శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 13,499 ధరకు లభిస్తుంది.

2. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G : ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 6.78-అంగుళాల ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆకర్షణీయమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 64MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 5500mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో 25శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు.

3. రియల్‌మి P3ఎక్స్ 5జీ : రియల్‌మి P3x 5G ఫోన్ బ్యాక్ సైడ్ 50MP కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా పొందుతుంది. ఈ ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 36శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 10,749కి కొనుగోలు చేయవచ్చు.

4. మోటోరోలా G45 5G : రూ.15 వేల బడ్జెట్ లోపు బెస్ట్ కెమెరా ఫోన్ల కోసం చూస్తుంటే.. మోటోరోలా G45 5G ఫోన్ కొనేసుకోండి. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో HDR మోడ్‌లో వీడియోలను సులభంగా రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అల్ట్రా-ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. 6.5-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 20శాతం తగ్గింపుతో రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు.

5. ఒప్పో K13x 5జీ : ఒప్పో K13x 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఏఐ డ్యూయల్ కెమెరా కలిగి ఉంది. ఏఐ సీన్ డిటెక్షన్, ఏఐ బ్లర్ కూడా కలిగి ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా పొందవచ్చ. ఈ ఒప్పో ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 21శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 14,999కు కొనుగోలు చేయవచ్చు.