Apple iPhone 16 Price : అదిరిపోయే ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Apple iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. అమెజాన్ పండగ సేల్ సందర్భంగా రూ. 7వేలు తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Price : అదిరిపోయే ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Apple iPhone 16 Price

Updated On : October 16, 2025 / 8:05 PM IST

Apple iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో అందిస్తోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 67వేల కన్నా తగ్గింపు ధరకే పొందవచ్చు.

మొదట రూ. 79,900 ధరతో లాంచ్ అయిన ఐఫోన్ 16 ఆపిల్ సరికొత్త A18 చిప్‌సెట్, కెమెరా (Apple iPhone 16 Price) సిస్టమ్, అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీరు కంటెంట్ క్రియేటర్ అయినా లేదా ప్రో మోడల్స్‌పై ప్రీమియం iOS ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ :
ఆపిల్ ఐఫోన్ 16 అసలు ధర రూ.69,900 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.66,900కి లిస్ట్ అయింది. రూ.3వేలు తగ్గింపుతో లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే.. అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఐఫోన్ 16 ధర కేవలం రూ.62,900కి తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్‌ రూ.56,300 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో ధర మరింత తగ్గుతుంది.

Read Also : Samsung Galaxy A55 5G : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఏకంగా రూ. 16వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 మోడల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. iOS18లో రన్ అవుతుంది. ఆపిల్ లేటెస్ట్ A18 చిప్ పవర్ అందిస్తుంది. 8జీబీ, 128GB స్టోరేజీని అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి 512GB వరకు విస్తరించవచ్చు.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 16 25W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3561mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.