Samsung Galaxy A55 5G : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఏకంగా రూ. 16వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్ పండగ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై క్రేజీ డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy A55 5G : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఏకంగా రూ. 16వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

Samsung Galaxy A55 5G

Updated On : October 16, 2025 / 7:37 PM IST

Samsung Galaxy A55 5G : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా, యూజర్ ఇంటర్‌ఫేస్, స్క్రీన్, పర్ఫార్మెన్స్ అందించే పర్ఫెక్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లను కొనేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ ఎలాంటి బ్యాంక్ (Samsung Galaxy A55 5G) ఆఫర్లు లేకుండా రూ. 16వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 39,999కు లాంచ్ కాగా 5,000mAh బ్యాటరీ, అమోల్డ్ ప్యానెల్, పవర్‌ఫుల్ ఇన్-హౌస్ ప్రాసెసర్‌ అందిస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ధర :
శాంసంగ్ గెలాక్సీ A55 5G ధర రూ.23,999కు తగ్గింది. ప్రారంభ ధర రూ.39,999 నుంచి తగ్గింపు పొందింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొనుగోలుదారులు అదనంగా రూ.719 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ ధర రూ.23,300 కన్నా తగ్గింపు పొందింది. అదనంగా చెల్లింపుతో మొత్తం మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా అంతకంటే ఎక్కువ యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

Read Also : Top 5 Washing Machines : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్‌.. టాప్ 5 వాషింగ్ మెషీన్లు ఇవే.. 54శాతం వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

మీరు ఈ శాంసంగ్ ఫోన్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ నెలకు రూ.1,164 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది. ఆసక్తిగ కొనుగోలుదారులు తమ పాత ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, బ్రాండ్ మోడల్ ఆధారంగా రూ.22,750 వరకు వాల్యూను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెషిఫికేషన్లు :
120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల పెద్ద అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ వివో ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 12MP కెమెరా, 5MP కెమెరా నేతృత్వంలోని ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.