Top 5 Washing Machines : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్‌.. టాప్ 5 వాషింగ్ మెషీన్లు ఇవే.. 54శాతం వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

Top 5 Washing Machines : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్‌‌లో భాగంగా 54శాతం వరకు తగ్గింపు అద్భుతమైన ఫీచర్లతో వాషింగ్ మిషన్లు లభ్యమవుతున్నాయి.

Top 5 Washing Machines : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్‌.. టాప్ 5 వాషింగ్ మెషీన్లు ఇవే.. 54శాతం వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

Top 5 Washing Machines

Updated On : October 16, 2025 / 7:03 PM IST

Top 5 Washing Machines : కొత్త వాషింగ్ మిషన్ కొంటున్నారా? ప్రస్తుతం పండగ సేల్ సందర్భంగా కొత్త వాషింగ్ మిషన్ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయొచ్చు. కొత్త వాషింగ్ మెషీన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో మొత్తం 5 వాషింగ్ మెషీన్‌లను 54శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

ఈ జాబితాలో రియల్‌మి, మోటోరోలా, ఎల్‌జీ, శాంసంగ్, థామ్సన్ వంటి అన్ని ప్రముఖ (Top 5 Washing Machines) బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి నచ్చిన కొత్త వాషింగ్ మెషీన్‌లను ఎంచుకోవచ్చు. వాషింగ్ మిషన్ ఫీచర్లు, తగ్గింపు ధరల వివరాలపై ఓసారి లుక్కేయండి.

1. రియల్‌మి టెక్‌లైఫ్ 7 కిలోలు (5-స్టార్) :
రియల్‌మి టెక్‌లైఫ్ 7 కిలోల 5-స్టార్ వాషింగ్ మెషీన్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్‌తో వస్తుంది. 1400 RPM స్పిన్ స్పీడ్ మోటారు కలిగి ఉంది. ఫైవ్-స్టార్ రేటింగ్‌తో చాలా లోయర్ పవర్ వినియోగిస్తుంది. 1400 ఆర్పీఎమ్ స్పిన్ సైకిల్‌‌తో బట్టలు త్వరగా ఆరిపోతాయి. హార్డ్ వాటర్ వాష్ చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మెషిన్ తుప్పు పట్టదు. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఈ వాషింగ్ మెషీన్‌ కొనుగోలుపై 44శాతం తగ్గింపుతో రూ. 6,990 మాత్రమే చెల్లించాలి.

2. మోటోరోలా 10 కిలోల 5-స్టార్ రేటింగ్ :

మోటోరోలా 10 కిలోల 5-స్టార్ వాషింగ్ మెషిన్ క్విక్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది. భారీ ఎయిర్-డ్రై లిడ్, పవర్‌ఫుల్ 1350 RPM స్పిన్‌తో అమర్చి ఉంటుంది. మీ దుస్తులను 15శాతం వరకు వేగంగా ఆరబెట్టగలదు. మీరు సబ్బు ఫంక్షన్‌తో హార్డ్ వాటర్ వాష్ చేయవచ్చు.

Read Also : Oppo Reno 13 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఒప్పో రెనో 13పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!

హెవీ-డ్యూటీ మోటార్‌తో లాంగ్ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఇందులో స్మార్ట్‌స్విర్ల్ క్లీనింగ్ టెక్నాలజీ, మ్యాజిక్ ఫిల్టర్ కూడా ఉన్నాయి. మీ బట్టలలోని చిన్న మరకలకు కూడా సులభంగా పొగొట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మెషీన్‌ కొనుగోలుపై 54శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,490కే ఇంటికి తెచ్చుకోవచ్చు.

3. ఎల్‌జీ 7కేజీ 5-స్టార్ :
ఎల్‌జీ 7 కిలోల 5-స్టార్ వాషింగ్ మెషీన్ విండ్ జెట్ డ్రై టెక్నాలజీతో వస్తుంది. తేమ తగ్గించేలా హైస్పీడ్‌తో రోలింగ్ చేస్తుంది. లాండ్రీని లోపల పొడిగా ఉంచుతుంది. వివిధ రకాల బట్టల కోసం జెంటిల్, స్ట్రాంగ్, నార్మల్, సోక్ వంటి 4 వాష్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది. దీనికి కాలర్ స్క్రబ్బర్ కూడా ఉంది. కాలర్లు, కఫ్‌లను క్లీన్ చేస్తుంది. తద్వారా టైమ్ సేవ్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 37శాతం తగ్గింపుతో కేవలం రూ. 10,290కే కొనుగోలు చేయొచ్చు.

4. శాంసంగ్ 8కిలోల వాషింగ్ మిషన్ (5-స్టార్) :
శాంసంగ్ 8 కిలోల 5-స్టార్ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. లో పవర్ వినియోగం, కనీస ఆపరేషన్ సౌండ్ పర్మినెంట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకేసారి అనేక లోడ్లతో బట్టలు ఉతికేందుకు అనుమతిస్తుంది.

మీ టైమ్‌తో పాటు పవర్ సేవ్ చేస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ఫ్రంట్, బ్యాక్ డ్యూయల్ మెష్‌తో మ్యాజిక్ ఫిల్టర్ కూడా ఉంది. లింట్, ఇతర లాండ్రీ సంబంధిత చెత్తను సేకరిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 29శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ. 18,990కు కొనేసుకోవచ్చు.

5. థామ్సన్ 7.5 కిలోల 5-స్టార్ ఆక్వా :
థామ్సన్ 7.5 కిలోల 5-స్టార్ ఆక్వా మ్యాజిక్ సెమీ-ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డిటర్జెంట్ బాక్స్‌తో వస్తుంది. వాటర్‌తో పాటు డిటర్జెంట్‌, ట్రెడేషనల్ డిజైన్‌ కలిగి ఉంది. టర్బో స్పిన్ డ్రై, టర్బో XL టెక్నాలజీని కూడా కలిగి ఉంది. మూడు రోలర్‌లతో నీరు, బట్టలను 3D మెథడ్‌లో తిప్పుతుంది. మీ బట్టల నుంచి మురికి, గట్టి మరకలను పూర్తిగా తొలగిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 39శాతం తగ్గింపు తర్వాత రూ. 6,990 ఖర్చు చేయాలి.