Oppo Reno 13 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఒప్పో రెనో 13పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!
Oppo Reno 13 Price : ఒప్పో రెనో 13 ధర తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

Oppo Reno 13 Price
Oppo Reno 13 Price : అమెజాన్ ఆఫర్ అదిరింది.. దీపావళి పండుగ సేల్ సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అనేక వైడ్ రేంజ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
గాడ్జెట్‌లు, హోం అప్లియన్సెస్ లేదా ఫెస్టివల్ గిఫ్ట్ (Oppo Reno 13 Price) కోసం చూస్తున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో ఒప్పో రెనో 13 అద్భుతమైన డీల్.. అమెజాన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా ఈ స్టైలిష్, ప్రీమియం-లుకింగ్ ఫోన్ రూ. 15వేల కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
ఒప్పో రెనో 13 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 13 రూ.37,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.23,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం రెనో 13పై రూ.14వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ ట్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 13లో 6.59-అంగుళాల 1.5K స్మార్ట్ అడాప్టివ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
ఒప్పో రెనో 13 ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీ నుంచి పవర్ పొందుతుంది. IP66, IP68, IP69 సర్టిఫికేట్లతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 13 5Gలో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మోనోక్రోమ్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా కలిగి ఉంది.