Anasuya: రామ్ చరణ్ అంటే పిచ్చి.. అతడినే ప్రేమించాను.. ఇంట్లోవాళ్లతో గొడవ పెట్టుకున్నాను..
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. (Anasuya)తనకు నచ్చినట్టు మాట్లాడేస్తుంది. లోపలకొటి పెట్టుకొని బయటకు ఒకలా ఉండటం ఆమెకు రాదు.

Hot anchor Anasuya makes crazy comments on Ram Charan
Anasuya: టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తనకు నచ్చినట్టు మాట్లాడేస్తుంది. లోపలకొటి పెట్టుకొని బయటకు ఒకలా ఉండటం ఆమెకు రాదు. అనసూయ గురించి కొంచం తెలిసినా ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే,(Anasuya) తన కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈసారి ఎందుకంటే.. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ఆలాగే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే పిచ్చి అని.. ఇంకా చాలా కామెంట్స్ చేసింది.
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటిగా రికార్డ్
ఈ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి యాంకర్ అడగగా.. నాకు పెళ్లికి ముందు ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడినే పెళ్లి చేసుకున్నాను. నమ్మిన వాళ్లను నేను విడిచిపెట్టలేను. వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్తాను. ఆలాగే, భరద్వాజ్ కోసం ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాను”అని చెప్పింది. ఇక ప్రస్తుతం ఉన్న నటులలో ఎవరంటే ఇష్టం అని అడగగా.. వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పేసింది. “నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఒక రకంగా పిచ్చి అనుకోవచ్చు. ఆయన లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మెగాస్టార్ కొడుకు అనే గర్వం అస్సలు ఉండదు. చాలా సింపుల్ గా ఉంటారు. ఒకవేళ భరద్వాజ్ లేకపోతే రామ్ చరణ్ తో డేటింగ్ చేసేదాన్నేమో” అని నవ్వుతూ చెప్పుకొచ్చింది అనసూయ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి మెప్పించింది అనసూయ. రామ్ చరణ్ కు సపోర్ట్ గా ఉండే ఏ పాత్రలో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఒక పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి స్టెప్పులు వేసింది అనసూయ.