ఇటలీలో కరోనావైరస్ తో నలభై ఐదు మంది వైద్యులు మరణించినట్లు ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం తెలిపారు.
ఇటలీలో కరోనావైరస్ తో నలభై ఐదు మంది వైద్యులు మరణించినట్లు ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం తెలిపారు. 45 మందివైద్యులకు పరీక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఫిలిప్పో అనెల్లి గురువారం వైద్య రక్షణ పరికరాల కోసం అత్యవసరంగా పిలుపిచ్చిన తర్వాత మరణాల సంఖ్య పెరిగింది.
అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుండి గురువారం నాటికి 6,000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనావైరస్ బారిన పడ్డారని ఇటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. ఇటలీలో ఇప్పటివరకు 8వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 80వేలమందకి పైగా ఇటలీలో కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు 198 దేశాలకు కరోనా వైరస్ పాకింది. మొత్తం ఇప్పటి వరకు ఐదున్నర లక్షలకు కరోనా బాధితుల సంఖ్య చేరింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకు 24వేల మందిని బలితీసుకుంది. ఐరోపా ఖండంలోనే 80శాతం మరణాలు చోటుచేసుకున్నాయి.
Also Read | లాక్ డౌన్ : వలస కార్మికులను ఢిల్లీ, ముంబై నుంచి బీహార్ కు తీసుకెళ్లేందుకు ముందుకొచ్చిన స్పైస్ జెట్