Trains Accident : ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46మంది మృతి.. 150మందికిపైగా గాయాలు

Spain Trains Accident : రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 39మంది ప్రాణాలు కోల్పోగా.. 150మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Spain Trains Accident

Spain Trains Accident : యూరప్‌లోని స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 46మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్‌–అండలూసియా రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పెయిన్‌ రైల్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌ ఏడీఐఎఫ్‌ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Railways Satey Rules : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రాత్రి 11 నుంచి ఫోన్ ఛార్జింగ్ బంద్.. రైల్వే బోర్డు కీలక ఆదేశాలు!

స్పెయిన్‌లోని టోలెడో ప్రావిన్స్‌లో మోరా, ఆర్గాజ్ పట్టణాల సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మాడ్రిడ్‌ నుంచి సెవిల్లా మార్గంలో ప్రయాణిస్తున్న రెన్ఫే , ఇరియో సంస్థలకు చెందిన రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరియో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు కాస్టిల్లా-లా మాంచా ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.

రైళ్లు ఢీకొన్న తీవ్రతకు కొన్ని బోగీలు రైల్వే ట్రాక్ పక్కనున్న గోడపై నుంచి కిందకు దూసుకెళ్లినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఎస్తేర్ పాడిల్లా తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

పాడిల్లా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన ఇరియో రైలులో ఒక చిన్నారితో సహా 147 మంది ప్రయాణిస్తున్నారు. రెన్ఫే రైలులో 397 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 150మందికిపైగా గాయపడినట్లు తెలిసింది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరికి టోలెడో, అల్కాజార్ డి శాన్ జువాన్, సియుడాడ్ రియల్ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు.

రెండు రైళ్లు ఢీకొన్న నేపథ్యంలో మాడ్రిడ్‌–అండలూసియా హైస్పీడ్ రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేసినట్లు అడిఫ్ సంస్థ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించింది. ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో దెబ్బతిన్న రైలు బోగీలు పక్కకు ఒరిగి గోతిలో పడివుండటం, ప్రమాద స్థలంలో శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపిస్తోంది.