Microsoft LayOffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్.. 4,800 మందిపై AI దెబ్బ.. మరోసారి భారీ లేఆఫ్స్
మైక్రోసాఫ్ట్ (Microsoft LayOffs)సంస్థ భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం చేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- July 6, 2026 / 09:30 PM IST
4,800 employees layoffs at Microsoft due to AI technology.
- మైక్రోసాఫ్ట్‌లో భారీ ఉద్యోగాల కోత
- 4800 మంది ఉద్యోగులపై వేటు
- ఏఐ పెట్టుబడుల కోసమే లేఆఫ్స్
Microsoft LayOffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ టెక్ రంగంలో ఉద్యోగాల కోత అంతకంతకూ తీవ్రమవుతోంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి భారీ లేఆఫ్స్(Microsoft LayOffs)కు శ్రీకారం చుట్టింది. ఖర్చుల నియంత్రణలో భాగంగా తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 2.1 శాతం మేర, అంటే దాదాపు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోమవారం నాడు అధికారికంగా ప్రకటించింది.
Mee Mart Stores: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ‘మీ మార్ట్’ షాపులు షురూ.. 5 రూపాయలకే సరుకులు
టెక్ కంపెనీలన్నీ ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాల కల్పనపై బిలియన్ డాలర్ల నిధులను కుమ్మరిస్తున్నాయి. ఈ ఏడాది అన్ని టెక్ సంస్థలు కలిపి ఏఐ రంగంలో ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు కూడా ఏఐ వైపు మళ్లుతూ, సంప్రదాయ ఉద్యోగాలపై కోత విధిస్తున్నాయి.
మరోవైపు 2026 మొదటి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 23 శాతం మేర పడిపోయాయి. 2022 తర్వాత కంపెనీకి ఇదే అత్యంత దారుణమైన ఫస్ట్ హాఫ్ ప్రదర్శన కావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ పరిధిలోని 7 శాతం మంది (దాదాపు 9,000 మంది) ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు లేఆఫ్స్ ప్రకటించడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
