Ice Mummy: చనిపోయిన శవంలో ‘సజీవ’ సంచలనం.. 5,300 ఏళ్లుగా బతికే ఉన్న బ్యాక్టీరియా.. ఒట్జీ మమ్మీ మరణం లేని మంచు కథ

ఒట్జీ(Otzi Mummy) మనిషి శవంలో 5,300 ఏళ్లుగా బతికే ఉన్న బ్యాక్టీరియా.

5300 Year Old Microbes From Ötzi the Iceman Are Still Showing Signs Of Life

  • మంచు మమ్మీలో సజీవంగా ఉన్న ప్రాణం
  • ఐదు వేల ఏళ్ల నాటి బ్యాక్టీరియా
  • సైన్స్ ప్రపంచాన్ని ఊపేసిన సరికొత్త ఆవిష్కరణ

Ice Mummy: నిజంగా ఇది విస్మయానికి గురిచేసే విషయమే. శాస్త్రవేత్తల అన్వేషణలకు కాలం ఎప్పుడు సరికొత్త జవాబులు చెప్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 5,300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ మంచు పర్వతాల్లో ఒక బాణం తగిలి ఒట్జీ (Otzi Mummy) అనే వేటగాడు ప్రాణాలు కోల్పోయాడు. శతాబ్దాల తరబడి స్తంభించిపోయిన ఆ మంచు సమాధిలో అతని శరీరం ఒక మమ్మీగా మారిపోయింది. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక సంచలన ఆవిష్కరణ మానవ చరిత్రను, సైన్స్ పరిమితులను ఒక్కసారిగా తిరగరాసింది అనే చెప్పాలి.

*Credit Card: పొరపాటున కూడా మీ క్రెడిట్ కార్డును ఈ పనుల కోసం వాడకండి.. లేదంటే అప్పులపాలవ్వడం గ్యారంటీ

ఐదు వేల ఏళ్లు దాటినా, ఆ మంచు మనిషి శరీరంలో ఇప్పటికీ మైక్రోస్కోపిక్ జీవం సజీవంగా స్పందిస్తోందని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మరణం తర్వాత శరీరం పూర్తిగా నిర్జీవమైపోతుంది, కానీ ఒట్జీ విషయంలో ఈ ప్రకృతి నియమాలు తలకిందులయ్యాయి. అతని ప్రేగులలోని పూర్వ కాలపు (prehistoric) గట్ బ్యాక్టీరియా, అత్యంత చలిని తట్టుకునే ప్రత్యేక ఈస్ట్ జాతులు (yeast strains) ఇప్పటికీ జీవక్రియలను సాగిస్తూ, జీవంతో కొట్టుమిట్టాడుతున్నాయని వారు కనుకొన్నారు. గడ్డకట్టిన ఆ మంచు పొరల కింద, శతాబ్దాలుగా ఈ సూక్ష్మజీవులు తమ ఉనికిని కాపాడుకుంటూ రావడం సైన్స్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఈ ఆవిష్కరణ మానవ పరిణామ క్రమాన్ని, ప్రాచీన కాలపు జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి సరికొత్త తలుపులు తెరిచిందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఐదు వేల ఏళ్ల నాటి ప్రాచీన సూక్ష్మజీవులు నేటికీ సజీవంగా ఉన్నాయంటే, విశ్వంలో జీవం ఎంతటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని బతకగలదని మరోసారి నిరూపితమైంది. కాల గమనాన్ని తట్టుకుని ఒట్జీ శరీరంలో దాగున్న ఈ ‘సజీవ కాలపు గుళిక’ వైద్య రంగంలో అమరత్వం, జీవ సంరక్షణపై సరికొత్త పరిశోధనలకు ఊపిరి పోస్తోంది.