జిహ్వకో రుచీ..పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. కంటికి ఏ చిన్న వస్తువు కనిపించినా మింగేస్తున్నాడో ఓ వ్యక్తి. చిన్న చిన్న రాళ్లు..కాయిన్స్, సీసాల మూతలు..ఇలా అన్ని గుటుక్కుమంటు మింగేయటం అతని అలవాటుగా మారింది. ఇంకేముంది..కొంతకాలాని కడుపులో నొప్పి రావటం మొదలైంది. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
కొరియాలో 54 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు డాక్టర్స్ పొట్టను స్కాన్ చేశారు. తరువాత స్కాన్ చూసి అవాక్కయ్యారు. సదరు వ్యక్తి కడుపులో రాళ్లు, సీసా మూతలు, కాయిన్స్, నట్లు చూసి షాకయ్యారు. నాణాలే కాకుండా ఇంట్లో ఏ చిన్న వస్తువు కనిపించినా వాటిని మందులుగా మింగిసేవాడట.
Read Also: చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం
ఈ క్రమంలో ఓ రోజు అతనికి కడుపు ఉబ్బరంగా, నొప్పిగా అనిపించడంతో వైద్యులను సంప్రదించగా అతని కడుపులో మొత్తం రెండు కిలోల నాణాలు, రాళ్లు, మూతలు, నట్లు, పిన్నులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు తొలుత ఎండోస్కొపీ ద్వారా నోటి నుంచి వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో సర్జరీ చేసి కడుపులో ఉన్న వస్తువులన్నీ తొలగించారు. ఈ విషయాన్ని డాక్టర్ పెయాంగ్ వాహ్ చి.. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేర్ రిపోర్ట్స్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని తెలిపారు.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!