Mexico Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. ముందుకు దూసుకొచ్చిన సముద్రం.. వీడియోలు వైరల్
Mexico Earthquake : మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దు ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రికర్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైంది.
- Harish Thanniru
- Published on- July 18, 2026 / 07:43 AM IST
Mexico Earthquake
- మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దు ప్రాంతంలో భూకంపం
- ఊగిపోయిన భవనాలు.. పరుగులు తీసిన ప్రజలు
- ముందుకు దూసుకొచ్చిన సముద్రం
Mexico Earthquake : మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దు ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రికర్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైంది. అమెరికా భూగర్భ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్ర తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 15కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ భూకంప ప్రభావం మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లోనూ బలంగా అనిపించింది.
భూకంపం కారణంగా పెద్దపెద్ద భవనాలు ఊగాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్వాటెమాలా రాజధానిలో పలుచోట్ల భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప కొండచరియలు విరిగిపడ్డాయి. చియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తరువాత తీవ్రత పెరిగింది. గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో భూకంపం సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. భూకంపం కారణంగా భవనాలు ఊగిపోయిన, ప్రజలు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
📍Chiapas, Mexico 🇲🇽
A strong 7.1-magnitude earthquake shakes Chiapas, Mexico.#earthquake #earthquakes #mexico#chiapas #climatedisaster pic.twitter.com/fGM2IZgdc5
— sustainme.in®️ (@sustainme_in) July 17, 2026
భూకంపం కారణంగా సముద్రం ముందుకు దూసుకొచ్చింది. మెక్సికో, గ్వాటెమాల తీరాల్లో ఒక మీటరు వరకు అలలు ఎగిసిపడ్డాయి. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఇప్పటివరకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. మెక్సికో, గ్వాటెమాలా ప్రభుత్వాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
Tsunami threat in effect after a magnitude 7.4 earthquake near the coast of Chiapas, Mexico. – US Tsunami Warning System#mexico #chiapasmexico #earthquake #tsunami #BreakingNews #NewsUpdate pic.twitter.com/gKdX3oD5vO
— Jio Sphere (@nitya03) July 17, 2026
అయితే భూకంపం తర్వాత పలుమార్లు 5 నుంచి 6 తీవ్రత మధ్య ఆఫ్టర్‌షాక్‌లు నమోదైనట్లు USGS వెల్లడించింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మాట్లాడుతూ.. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ప్రాథమికంగా ఎలాంటి పెద్ద నష్టం కనిపించలేదని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
A major #earthquake struck off the coast of #Mexico, near the Guatemala border on Friday morning, causing a #tsunami threat to be issued for the coasts of both countries.
The earthquake happened at 7:48 a.m. Pacific time, and was originally reported as a #magnitude 7.4. pic.twitter.com/zPDAYNWcZL— Samir Shukla (@SamirShukla) July 17, 2026
మెక్సికో, గ్వాటెమాల ప్రాంతాల్లో గతంలోకూడా భారీ భూకంపాలు సంభవించాయి. 2017లో మెక్సికోలో సంభవించిన 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సంభవించిన భూకంపం మూడు దేశాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ.. పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు.
