×
Ad

kangaroos on a golf court: గోల్ఫ్‌ కోర్టులో కంగారులు గుంపు..నేనెలా ఆడాలి? గోల్ ఎలా వేయాలి?

ఓ క్రీడాకారిణి గోల్ఫ్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తోంది. గోల్ వేయటానికి సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడికి ఓ కంగారులు గంపు వచ్చి హల్ చల్ చేసింది.దీంతో ఆమె ఇప్పుడు నేనెలా ఆడాలి? అంటూ నవ్వుతు

Kangaroos On A Golf Court

A group of kangaroos on a golf court   :  ఆస్ట్రేలియా అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి కంగారు జంతువులు. ఇవి గుంపులు గుంపులుగా జీవిస్తుంటాయి. అలా గుంపుగా ఉండే కంగారులు ఓ గోల్ఫ్ కోర్టులోకి వచ్చింది. అవి అక్కడకు ఎందుకొచ్చాయి? అవికూడా గోల్ఫ్ ఆడటానికా? అన్నట్లుగా ఉంది అవి గుంపుగా నిలబడిన తీరు చూస్తే. గోల్ఫ్ కోర్టులో ఓ క్రీడాకారిణి ప్రాక్టీస్ చేస్తోంది. గోల్ వేద్దామని స్టిక్ తో చక్కగా గురిచూసుకుంటోంది. అంతలో కంగారులు గుంపును చూసి షాక్ అయ్యింది. వాటిని చూసి నవ్వుకుంది. ఇప్పుడు నేనేలా ఆడాలి? గోల్ వేయాలి? అంటూ నవ్వుతోంది. కంగారుల తీరు చూస్తే మనకు కూడా నవ్వొచ్చేలా ఉంది.

Read more : Dancing Dadi : ఏజ్ ఎంతైనా తగ్గేదేలే..సూపర్ స్టెప్పులతో శ్రీదేవిని దించేసిన 63 ఏళ్ల బామ్మ..
ఆస్ట్రేలియాకు చెందిన ఒక గోల్ఫ్‌ క్రీడాకారిణి గోల్ఫ్‌ కోర్సులో ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక్కసారిగా ఒక్కో కంగారు జంతువు వస్తూ అలా దండుగా మొత్తం కంగారు సముహం వచ్చిపడింది. దీంతో ఆ క్రీడాకారిణికి గోల్ఫ్‌ చేయడానికి ఆటంకం జరిగింది. కానీ అవి దండుగా మేము కూడా గోల్ఫ్‌ నేర్చుకుంటాం అన్నట్లుగా క్రీడాకారిణి దగ్గరకు వస్తాయి.

Read more : US returns 250 antiquities: 250 కళాఖండాల్ని భారత్ కు అప్పగించి అమెరికా

అవి అన్ని గెత్తుతు మొత్తం ఆ గోల్ఫ్ కోర్టు అంతా తిరిగాయి. దీంతో ఆమె ఆశ్యర్యపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఆమె గోల్ఫ్‌ ఎలా చేస్తారో చూడటానికి వచ్చినట్టున్నాయి అని కొంతమంది అంటే మరికొందరు నువ్వేంటీ చేసే మేం గోల్ వేస్తే పడి తీరాల్సిందే అంటున్నాయంటున్నారు. ఇలా ఫన్నీ ఫన్నీ ట్వీట్ లతో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.