US returns 250 antiquities: 250 కళాఖండాల్ని భారత్ కు అప్పగించి అమెరికా

అపహరణకు గురైన సుమారు15 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్‌ తిరిగి ఇచ్చింది.

US returns 250 antiquities: 250 కళాఖండాల్ని భారత్ కు అప్పగించి అమెరికా

Us Returns 250 Antiquities

US returns 250 antiquities: న్యూయార్క్‌లోని మాజీ ఆర్ట్ డీలర్ సుభాష్ కపూర్. ప్రపంచంలోనే అంత్యంత పేరుమోసిన స్మగ్లర్ అని.. పురాతన వస్తువుల్ని స్మగ్లింగ్ చేయటంతో సుభాష్ కపూర్ ఒకరు అని స్వయంగా అధికారులు తెలిపారు. అలా సుభాష్ కపూర్ ద్వారా  అపహరణకు గురై స్మగ్లర్ల ద్వారా అమెరికాకు తరలిన పురాతన కళాఖండాలను యూఎస్ భారత్ కు అప్పగించింది. దశాబ్దాలుగా అమెరికాలో ఉండిపోయిన 250 ప్రాచీన కళాఖండాలు తిరిగి భారత్​కు అప్పగించింది అమెరికా.

దీనికి సంబంధించి కార్యాచరణ దర్యాప్తులో పూర్తి అయ్యింది. దీంతో సుమారు15 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్‌ తిరిగి ఇచ్చింది. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో గురువారం (అక్టోబర్ 28,2021) యూఎస్ భారత్‌కి అందజేసింది. ఈ మేరకు ఈ వస్తువులు మాన్‌హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం, యూఎస్‌ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జరిపిన సుదీర్ఢ దర్యాప్తులో వెలుగు చూశాయి.

Read more : Gold Island : బంగారు ఐలాండ్ లో మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువైన నిధి..!

ఇలా అందజేసిన కళాఖండాల్లో నాలుగు మిలియన్ డాలర్ల విలువజేసే నటరాజ స్వామి కాంస్య విగ్రహం ప్రధానమైనది. ఈ సందర్భంగా యూఎస్‌ డిస్ట్రిక్‌ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ.. డీలర్ సుభాష్ కపూర్ యునైటెడ్ స్టేట్స్‌కు పదివేల పురాతన వస్తువులపై అక్రమంగా తరలించారని ఆరోపణల క్రమంలో విస్తృత దర్యాప్తు పై దృష్టి సారించాం. తమ సుదీర్ఘ దర్యాప్తు ఫలితంగా 143 మిలియన్ల డాలర్ల విలువైన 2,500 కళాఖండాలు తిరిగి సంపాదించగలిగాం. ఈ నేరానికి పాల్పడిన కపూర్‌ అతని సహ కుట్రదారులు తగిన శిక్ష పడుతుందని తెలిపారు. ఈ కళాఖండాల విలువ రూ.112 కోట్లు (15 మిలియన్‌ డాలర్లు) ఉంటుందని అంచనా. గత దశాబ్దకాలంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని రికవరీ చేసినట్లు మాన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ వాన్స్‌ తెలిపారు.

కపూర్ 2011లో జర్మనీలో అరెస్ట్ అయి అయితే కపూర్‌ ప్రస్తుతం భారతదేశం జైలులో ఉన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు దర్యాప్తును యూఎస్‌ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కపూర్‌ గ్యాలరీ నుంచి వాటిని సేకరించిన యూఎస్‌.. భారత్‌కు అప్పగించింది. భారతదేశం, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల నుండి దోచుకున్న నిధులను రవాణా చేయడానికి న్యూయార్క్‌లోని తన ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీని వినియోగించారు. ఈ క్రమంలో కపూర్‌ పురాతన వస్తువులను వెతకడానికి ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. దేవాలయాల నుంచి పురాతన వస్తువుల్ని దొంగలిస్తూ వాటిని రహస్యంగా తరలించేవాడు.

Read more : PM Modi : అమెరికా నుంచి పురాతన వస్తువులను భారత్ కు తీసుకొస్తున్న ప్రధాని మోడీ

అధికారులు తెలిపిన ప్రకారం.. కపూర్ మల్టీ నేషన్ స్మగ్లింగ్ చేస్తు.. గత మూడు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్, కంబోడియా, ఇండియా, నేపాల్, పాకిస్తాన్ మరియు థాయ్‌లాండ్ నుండి దాదాపు 2,600 వస్తువులను స్మగ్లింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. కళాఖండాల కోసం తప్పుడు కాగితపు మార్గాలను సృష్టించింది.వస్తువుల చట్టబద్ధతను నిరూపించడానికి వాటిని సంక్షిప్తంగా మ్యూజియంలకు ఇచ్చింది. వారు వాటిని సేకరించేవారు. ఆర్ట్ డీలర్లు, మ్యూజియంలకు పెద్ద లాభాల కోసం ప్రపంచవ్యాప్తంగా విక్రయించారు.

మాన్‌హట్టన్,క్వీన్స్‌లో కపూర్ నియంత్రణలో ఉన్న ప్రదేశాల నుండి దొంగిలించబడిన చాలా వస్తువులు తిరిగి ఆయా దేశాలకు పంపబడ్డాయి. 2011లో జర్మనీలో అరెస్టయిన తర్వాత కూడా కపూర్ అత్యంత విలువైన వస్తువులను తన కుటుంబ సభ్యులకు అందజేయాలని, వాటిని రహస్య ప్రదేశాలకు తరలించాలని తన అనుచరులకు సూచించాడు.