Donald Trump: ఈ రాత్రికే ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. ఇరాన్ కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్
ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
- Naveen
- Published On : April 7, 2026 / 07:42 PM IST
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంఘర్షణను ముగించడానికి ఒప్పందం కుదరకపోతే “ఈ రాత్రే ఒక నాగరికత అంతరించిపోతుంది” అంటూ ఇరాన్ ను తీవ్రంగా హెచ్చరించారు ట్రంప్. మంగళవారం నాటి గడువులోగా ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌ను మరోసారి కోరారు ట్రంప్.
“ఈ రాత్రే ఒక నాగరికత అంతరించిపోతుంది, దానిని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది” అని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. నిజానికి ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ, ఆ పని చేయక తప్పడం లేదు. ఇరాన్‌లో 47 ఏళ్ల అవినీతి, అరాచకపాలన అంతం కానుంది. ఇక, ఇరాన్ ప్రజలను ఆ దేవుడే రక్షించాలి” అంటూ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు ట్రంప్. కాగా, ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ నేటి (ఏప్రిల్ 7) రాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
హార్మూజ్ జలసంధిని మంగళవారం రాత్రిలోగా తిరిగి తెరవాలని ఇరాన్ కు డెడ్ లైన్ విధించారు ట్రంప్. అలా చేయకుంటే ఇరాన్ లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, వంతెనలను బాంబులతో లేపేస్తామన్నారు.
Also Read: డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా దాడులు..
