Pakistan-Afghanistan War : పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్లు ఫైర్.. పవిత్ర రంజాన్ మాసంలో ప్రాణాలు తీశారంటూ..

Pakistan-Afghanistan War : అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. అఫ్గానిస్థాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ ఎమోషనల్ అయ్యారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

Afghanistan Cricketers Rashid Khan and naveen-ul-haq reacts after pakistan airstrike on kabul hospital

  • అఫ్గాన్‌లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి
  • 400మందికిపైగా మృతి.. వందలాది మందికి గాయాలు
  • పాక్ తీరుపై అఫ్గాన్ క్రికెటర్లు ఆగ్రహం

Pakistan-Afghanistan War : పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులతో అర్ధరాత్రి విధ్వంసం సృష్టించింది. కాబుల్‌లోని ఓ ఆస్పత్రిపై దాడులు చేయగా.. అఫ్గాన్ పౌరులు 400 మంది మృతి చెందారు. మరో 250మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read : Pakistan-Afghanistan War : అఫ్గాన్‌లోని ఆస్పత్రిపై వైమానిక దాడులతో పాకిస్థాన్ విధ్వంసం.. 400మందికిపైగా మృతి..

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. అఫ్గానిస్థాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ ఎమోషనల్ అయ్యారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దారుణాలకు ఒడిగడతారా అంటూ పాకిస్థాన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఈ ఘటనపై ట్విటర్ వేదికగా స్పందించారు. కాబూల్‌లోని ఓ ఆస్పత్రిలపై పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడం ద్వారా వందలాది మంది అఫ్గాన్ పౌరులు మరణించినట్లు వచ్చిన వార్తలతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. పౌరుల ఇళ్లను, విద్యా సంస్థలను, వైద్య సదుపాయాలు అందించే భవనాలపై పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం యుద్ధ నేరం. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ ఇలా చేయడం ఆ దేశం పట్ల అసహ్యం కలిగిస్తోంది. ఈ దారుణ ఘటనపై ఐక్యరాజ్యసమితి (UN), ఇతర మానవ హక్కుల సంస్థలు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రషీద్ ఖాన్ డిమాండ్ చేశాడు. అదేవిధంగా ఈ కష్టకాలంలో తన దేశ ప్రజలకు అండగా ఉంటానని, ఒక జాతిగా తాము మళ్లీ పుంజుకుంటామని రషీద్ పేర్కొన్నారు.

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ట్విటర్ వేదికగా పాకిస్థాన్ పై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ పాలనకు మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. తన దేశ ప్రజలపై జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. నబీ ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.