Afghan ATMs,Bank Rush :ఆఫ్గాన్ లో ఏటీఎంలు, బ్యాంకులకు క్యూలు క‌ట్టిన ప్రజలు

ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ తాలిబన్లు హస్తగతం చేసుకోవటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో ఏటీఎంలు, బ్యాంకులకు డబ్బుల కోసం క్యూ కట్టారు.

Rush at atms and banks in afghan: ఆఫ్ఘ‌నిస్థాన్ లో తాలిబ‌న్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలనలకు గురవుతున్నారు. వేరే దేశం నుంచి వచ్చి ఆఫ్గానిస్థాన్లో ఉన్నవారు ప్రాణాలతో అక్కడనుంచి వారి స్వదేశాలకు వెళ్లిపోవాలను కుంటున్నారు. అలాగా ఆఫ్గాన్ దేశస్తులు కూడా అవకాశం ఉన్నంత వరకూ దేశాన్ని విడిచిపోవాలనుకుంటున్నారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చిన పరిస్థితి ఉంది.

ఆఫ్గాన్ లో నాయకుల పాలన పోయిన ఉగ్రపాలనకు ఏర్పాట్లు జరుగుతుండటంతో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఉపాధి క‌ర‌వ‌వుతుంద‌ని, ఉద్యోగాలు పోతాయని అసలు ప్రాణాలే పోతాయని ఆఫ్ఘన్ ప్ర‌జ‌లు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రోజుకొక యుగంగా బ్రతుకుతున్నారు.

ఇటువంటి దారణ పరిస్థితుల్లో బ్యాంకుల్లో ఉన్న తమ సొమ్ములపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంల‌లో ఉన్న తమ డబ్బును డ్రా చేసుకోవ‌డానికి ఎగబడుతున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు పెద్ద ఎత్తున‌ బారులు తీరి క‌న‌పడుతున్నారు. ఇన్నాళ్లు క‌ష్ట‌ప‌డి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డ‌బ్బు తమకు దక్కదేమోనని భయపడుతున్నారు. డబ్బులుడ్రా చేసుకోవాటానికి భారీగా ఏటీఎంలు, బ్యాంకులకు పరుగులుపెడుతున్నారు.

మరోపక్క తాలిబన్లు ఎప్పుడు తమమీద విరుచుకుపడతారో తెలియక క్షణమొక యుగంలా గుడుపుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు కూడా బహిరంగ ప్రదేశాలకు వచ్చి బిక్కు బిక్కుముంటు గడుపుతున్నారు తమ ఇళ్లమీద ఎక్కడ బాంబులతో దాడులు చేస్తారేమోనని. తమ కష్టార్జితానికే కాదు తమ బతుకులకు..తమ ప్రాణాలకు కూడా భద్రత లేని అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకుతున్నారు ఆఫ్గాన్ లో ఉన్న ప్రజలు.

ట్రెండింగ్ వార్తలు