స్ఫూర్తి : బాంబు దాడిలో తెగిపోయింది.. పెట్టుడు కాలుతో డ్యాన్స్ చేస్తున్నాడు

ల్యాండ్ మైన పేలిన ప్రమాదంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, అహ్మద్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు అని సంతోషించేలోపే తన కాలుకోల్పోయాడని కన్నవాళ్లకు తెలిసికన్నీరు మున్నీరయ్యారు.

ల్యాండ్ మైన పేలిన ప్రమాదంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, అహ్మద్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు అని సంతోషించేలోపే తన కాలుకోల్పోయాడని కన్నవాళ్లకు తెలిసికన్నీరు మున్నీరయ్యారు.

ల్యాండ్ మైన్ పేలిన ప్రమాదంలో ఆ చిన్నారి కాలు పోయాడు. అప్పటివరకూ తిరిగిన బాల్యమంతా మూగబోయింది. కదలలేని వాడిగా మిగిలిపోయాడు. అఫ్ఘనిస్తాన్‌లోని ఓ చిన్నారి కథ ఇది. ఆ చిన్నారి గురించి తెలుసుకున్న ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ ఆర్థోపెడిక్ సెంటర్ (ఐసీఆర్సీ)చలించిపోయింది. 

ల్యాండ్ మైన పేలిన ప్రమాదంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, అహ్మద్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు అని సంతోషించేలోపే తన కాలుకోల్పోయాడని కన్నవాళ్లకు తెలిసికన్నీరు మున్నీరయ్యారు. ఐసీఆర్సీ గురించి తెలుసుకుని సంప్రదించారు. ఆర్థోపెడిక్ చికిత్స అనంతరం కృత్రిమంగా కాలును ఏర్పాటు చేశారు. 

మళ్లీ తనకు కాలు తిరిగొచ్చిందన్న ఆనందంలో అహ్మద్ చిరునవ్వులు చిందిస్తూ హాస్పిటల్‌లోనే చుట్టూ తిరుగుతూ సందడి చేశాడు. డ్యాన్స్ వేశాడు. హాస్పిటల్ సిబ్బందితో పాటు వ్యాధి బారినపడి అక్కడికి వచ్చిన మిగిలిన రోగులు కూడా ఉత్సాహాన్ని నింపుకున్నారు. ఈ వీడియోను అక్కడే ఉన్న రోయ ముసావి అనే వ్యక్తి పోస్టు చేయడంతో 19వేల లైకులు.. 5వేల వీక్షకులను సంపాదించుకుంది.