మొన్ననే వెనెజువెలాపై దాడి.. ఇప్పుడు క్యూబాకు ట్రంప్‌ వార్నింగ్‌.. ఇక లేట్‌ చేయొద్దంటూ..

“క్యూబాకు ఇకపై చమురు, డబ్బు ఏమీ వెళ్లవు.. ఆలస్యం కాకముందే వారు ఒప్పందం చేసుకోవాలని నేను సూచిస్తున్నాను” అని ట్రంప్ పేర్కొన్నారు.

మొన్ననే వెనెజువెలాపై దాడి.. ఇప్పుడు క్యూబాకు ట్రంప్‌ వార్నింగ్‌.. ఇక లేట్‌ చేయొద్దంటూ..

Donald Trump (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 8:28 PM IST
  • క్యూబాకు చమురు, డబ్బు ఏమీ వెళ్లవు..
  • ఆలస్యం కాకముందే వారు ఒప్పందం చేసుకోవాలి
  • ట్రూత్ సోషల్‌లో ట్రంప్‌ పోస్ట్  

Donald Trump: వెనెజువెలాపై ఇటీవలే దాడి చేయించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు క్యూబాకు వార్నింగ్ ఇచ్చారు. “ఇప్పుడే అమెరికాతో ఒప్పందం చేసుకోండి, ఆలస్యమైతే మీకే నష్టం” అని హెచ్చరించారు.

“క్యూబాకు ఇకపై చమురు, డబ్బు ఏమీ వెళ్లవు.. ఆలస్యం కాకముందే వారు ఒప్పందం చేసుకోవాలని నేను సూచిస్తున్నాను” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. క్యూబా ఎన్నో సంవత్సరాలపాటు వెనెజువెలా నుంచి భారీగా వచ్చే చమురు, డబ్బుపై ఆధారపడి జీవించిందని ట్రంప్ అన్నారు.

Also Read: PCB: భారత్‌లో బంగ్లాదేశ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచులు ఆడకపోతే ఇలా చేయండి.. మేమున్నాముగా..: పాకిస్థాన్‌

కాగా, క్యూబా రాజధాని హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయం ఎదుట శనివారం వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెనెజువెలాపై దాడి చేసి నికోలస్‌ మదురోను నిర్బంధించిన అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

“ఇది అంతర్జాతీయ చట్టాల నిబంధనల ఉల్లంఘన. యునైటెడ్ స్టేట్స్‌కు వెనెజువెలాకు ఎలాంటి ముప్పు లేదు. అటువంటి శాంతియుత దేశంపై అమెరికా దాడి చేసింది” అని ఆయన చెప్పారు.

క్యూబాకు అవసరమైన చమురు దిగుమతుల్లో సుమారు 30% వెనెజువెలా సరఫరా చేస్తోంది. ఈ చమురును కోల్పోతే.. ఇప్పటికే బలహీనంగా ఉన్న క్యూబా విద్యుత్ వ్యవస్థ, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.