ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి లక్షణాలు జ్వరం, నీరసం, పొడిదగ్గు, శ్వాసలో ఇబ్బంది ఇవే అనుకున్నాం. ఈ లక్షణాలు ఉంటేనే కరోనా అని భయపడుతున్నాం. కొందరిలో అటువంటి లక్షణాలేమీ కనిపించకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో లక్షణం కరోనాపై బెదురుపుట్టేలా చేస్తుంది.
చర్మంపైన కరోనా లక్షణాలు కనిపిస్తాయంటున్నారు ఫ్రెంచ్ నేషనల్ యూనియన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్-వెనెరాలజిస్ట్ ఆర్గనైజేషన్. విపరీతమైన దురదతో పాటు నొప్పితో కూడిన ఎరుపురంగు దద్దుర్లు కూడా కరోనా లక్షణాల్లో ఒకటిగా పరిగణించవచ్చు. లా ఫిగారో అనే ఫ్రెంచ్ న్యూస్ పేపర్.. కొవిడ్-19తోనే ఎరుపు రంగులోకి మారతాయంటున్నారు.
ఒకేసారి ఇలా మారడం వల్ల నొప్పి ఉంటుందని కాసేపటికే అవి మాయమవుతాయిన అంటున్నారు. ఇలా చర్మం మారితే కొవిడ్-19 అవ్వొచ్చు.. అవ్వొకపోవచ్చని 400మంది పని చేస్తున్న ప్రొఫెషనల్ గ్రూప్ అంటోంది. అవి శ్వాస సంబంధిత కారణంగా అలా మారతాయని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ఉన్న వారిలో శ్వాస సమస్య ఉంటుందనేది మనకు తెలిసిందే.
చాలా కేసుల్లో ఈ లక్షణం కనపడిందని ఆ గ్రూప్ చెబుతుంది. అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. హెల్త్ జెరోమ్ సాలమోన్ డైరక్టర్ జనరల్ కొత్తగా జరిపిన సైంటిఫిక్ స్టడీ మీద తనకు అవగాహన లేదని.. కాకపోతే కరోనా వైరస్ అనుమానం పుట్టించడంలో ఇది సహాయపడుతుందని అంటున్నారు.