రేపు కొలువుదీరనున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఇక యూనస్ దారెటు? ఆయన సలహాదారుగా ఉన్న సమయంలో రచ్చ రచ్చ
ప్రొఫెసర్ యూనస్‌తో పాటు ఎవరికీ ఏ పోస్టునూ కన్ఫర్మ్ చేయలేదు.
Muhammad Yunus
- ఇన్నాళ్లు బంగ్లాదేశ్ సలహాదారుగా యూనస్
- రేపు బంగ్లాదేశ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం
- యూనస్‌కు ఏదైనా పదవి దక్కుతుందా?
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పాలన ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ముహమ్మద్ యూనస్ కొనసాగుతున్నారు. ఆయన ప్రధాన సలహాదారుగా ఉన్న సమయంలో భారత్‌పై బంగ్లాదేశ్‌లో ఎంతగా వ్యతిరేకత వచ్చిందో, హిందువులపై దాడులు ఎంతలా జరిగాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
ఇప్పుడు ముహమ్మద్ యూనస్ పదవీ కాలం ముగింపు దశకు వచ్చేసింది. అయితే, ఇక బంగ్లాదేశ్‌లో యూనస్ ఏ పాత్ర పోషిస్తారన్న దానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏ మేరకు ఉందంటే? ఫుల్ డీటెయిల్స్
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షుడు తారిక్ రహమాన్ నేతృత్వంలో మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇందులో ముహమ్మద్ యూనస్ రాజ్యాంగబద్ధ హోదాలో కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్‌లోని మేధావులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని తారిక్ రహమాన్ భావిస్తున్నారని ఆయన సలహాదారు హుమాయున్ కబిర్ తెలిపారు.
ప్రొఫెసర్ యూనస్‌తో పాటు ఎవరికీ ఏ పోస్టునూ కన్ఫర్మ్ చేయలేదని చెప్పారు. అయితే, దేశాభివృద్ధికి ఉపయోగపడే సామర్థ్యం ఉన్న వారితో కలిసి పనిచేయడానికి తారిక్ రహమాన్ త్వరలోనే చర్చలు జరుపుతారని అన్నారు.
కాగా, మంగళవారం.. తొలుత కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం కొత్త ప్రధానమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తారిక్ రహమాన్‌తో బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్ ప్రమాణం చేయిస్తారు.
