Cm Chandrababu Naidu: సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu Naidu) నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- June 14, 2026 / 09:50 PM IST
Ap cm Chandrababu Naidu Singapore tour details World Cities Summit participation news
- చంద్రబాబు సింగపూర్ పర్యటన
- పెట్టుబడుల ఆకర్షణ భేటీలు
- వరల్డ్ సిటీస్ సమిట్ పాల్గొనడం
Cm Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu Naidu) నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి తెలుగు సంఘాలు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి సీఎంను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని పలకరించి, కొందరితో ఫోటోలు దిగారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ నగరాల సదస్సు (World Cities Summit)లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆయన సింగపూర్‌లోని పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.
అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అక్కడి మంత్రులు, అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా-జురాంగ్ ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో వరుసగా చర్చలు జరిపి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.
