Apple Watch reportedly detected a woman's pregnancy
Apple Watch : టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టెక్నాలజీ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది యాపిల్ గాడ్జెట్స్ . యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్. యాపిల్ బ్రాండ్స్ పరికరాలు ఖరీదైనవే అయినా ప్రాణాలు కాపాడే ఆపద్భాంధవులనే చెప్పాలి. యాపిల్ వాచ్ ధరించిన వ్యక్తులు ప్రమాదాల నుంచి గుండెపోటుల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారనే వార్తలు విన్నాం. వింటున్నాం. యాపిల్ వాచ్‌ల్లో ఉండే హార్ట్ రేట్ ట్రాకర్లు కచ్చితంగా పనిచేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఘటనలు జరిగాయి.
అటువంటి యాపిల్ వాచ్ మరో ఘనత చాటుకుంది. యాపిల్ వాచ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసేస్తోంది. ఇది వినటానికి కాస్త వింతగా ఉన్నా నిజంగానే జరిగింది. యాపిల్ వాచ్ లో బీపీ చెక్ చేసుకోవడం, స్లిపింగ్ మోడ్, పల్స్‌రేటు స్టెప్‌కౌంటింగ్ తదితర ఫీచర్స్ ఉంటున్నాయి. అటువంటి యాపిల్ వాచ్ తాజాగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసేసింది. అది వాచే కాదు డాక్టర్ కూడా అనిపించుకున్న ఘటన జరిగింది.
మహిళ ప్రెగ్నెంట్ అని గుర్తించిన యాపిల్ వాచ్..
యాపిల్ వాచ్ ధరించిన ఓ మహిళ తను గర్భం ధరించిందని యాపిల్ వాచ్ గుర్తించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపింది. తాను క్లినికల్ టెస్ట్ చేయించుకోకుండానే తన యాపిల్ వాచ్ తను ప్రెగ్రెంట్ అని గుర్తించిందని వెల్లడించిందామె. గర్భం దాల్చిన విషయం తాను గుర్తించక ముందే యాపిల్ వాచ్ సూచించిందని తెలిపింది. తనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని డాక్టర్ ను సంప్రదించాలని అలెర్ట్ లు (హార్ట్ బీట్ స్థాయి ద్వారా) వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.
34 సంవత్సరాలున్న మహిళ తన ఆపిల్ వాచ్ కొన్ని రోజుల వ్యవధిలో తన హృదయ స్పందన రేటులో గణనీయమైన పెరుగుదలను సూచించిందని గమనించింది. సాధారణంగా విశ్రాంతి హృదయ స్పందన రేటు 57 నుంచి 72కి పెరిగిందని..అలా గుండె స్పందన రేటు గణనీయంగా పెరగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. కోవిడ్ సోకిందేమోనని అనుమానించింది. వెంటనే టెస్టులు చేయించుకుంది. ప్రతికూల ఫలితాలు వచ్చాయి. తాను గర్భం దాల్చిన మొదటి వారాలలో వేగవంతమైన హృదయ స్పందన రేటును గమనించానని తెలిపిందామె. తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఆస్పత్రికి వెళ్లగా, నాలుగు వారాల గర్భవతి అని నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఇలా నాకు తెలియకుండానే గర్భం దాల్చినట్లు వాచ్ తెలిపిందని తెలిపిందామె.
కాగా.. ఆపిల్ వాచ్‌కు గర్బాన్ని గుర్తించే అధికారిక ఫీచర్ లేదు. ఇది సగటు హృదయ స్పందన రేటులో మార్పు ద్వారా శరీరంలో జరుగుతున్న అసాధారణ విషయాలను గుర్తించగలదు. ఇందులో ఐఓఎస్16 అప్డేట్‌తో ఆపిల్ వాచ్ మహిళల కోసం ఒక ముఖ్యమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే సైకిల్ ట్రాకింగ్ యాప్. ఈ ఫీచర్ మహిళల రుతుచక్రం గురించి వివరాలను రికార్డు చేయడానికి, దానిని ట్రాక్ చేయడంలో వారికి సహాయపడుతుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ అల్ట్రాతో శరీర ఉష్ణోగ్రత సెన్సార్‌ను తీసుకువచ్చింది. ఇది పిరియడ్ అంచనాలను ట్రాక్ చేయగలదు.
An #AppleWatch has reportedly been credited with spotting a woman’s pregnancy before she was even aware of it. pic.twitter.com/oF2baKE3CI
— IANS (@ians_india) October 9, 2022
యాపిల్ వాచ్ లో పీరియడ్స్ ట్రాకింగ్ ఫీచర్..
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇండియాలో వాచ్ సిరీస్ 8ను అనౌన్స్ చేసింది. దీంట్లో మహిళల హెల్త్‌ను ట్రాక్ చేసేందుకు అత్యాధునిక ఫీచర్లను, హెల్త్ కేపబిలిటీస్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్ సిరీస్ 8, అల్ట్రాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ మహిళల పీరియడ్ డేట్స్ గురించి అలర్ట్ చేస్తుంది. పీరియడ్స్ సైకిల్‌ను ట్రాక్ చేస్తుంది. ఇన్ని ఫీచర్లు మరి ఏ ఫోన్లోనే లేవు. అందుకే ద గ్రేట్ యాపిల్ బ్రాండ్ అని చెప్పాల్సిందే.
యాపిల్ వాచ్ ధరించటంతో..గుండెపోటునుంచి ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి
యాపిల్ వాచ్ మనుషుల ప్రాణాల ప్రాణాలు కాపాడింది అనే వార్తలు వింటున్నాం. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి యాపిల్ వాచ్ ధరించటం వల్ల తనకు వచ్చిన గుండెపోటు నుంచి తప్పించుకున్నాడు. యాపిల్ వాచ్‌ల్లో ఉండే హార్ట్ రేట్ ట్రాకర్లు కచ్చితంగా పనిచేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడయనే వార్తలు తరచుగా వస్తున్నాయి.
ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడిపోగా గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. సహాయం చేయటానికి పక్కన ఎవ్వరు లేరు. కానీ అతని ప్రాణాలకు యాపిల్ వాచ్ కాపాడింది. ఆ వ్యక్తి పడిపోతున్న విషయాన్ని అతడి చేతికున్న యాపిల్ వాచ్ గుర్తించి ఎమర్జన్సీ నంబర్ కు దానంతటదే ఫోన్ చేసింది మరి. ఎమర్జన్సీ ఫోన్ కాల్‌ను గుర్తించిన పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి..సదరు వ్యక్తి ప్రాణాలు కాపాడారు. యాపిల్ వాచ్ ఎస్‌ఈ లేదా యాపిల్ వాచ్ సిరీస్ 4, దీని తర్వాతి మోడల్ గడియారాల్లో కింద పడిపోతున్నవారిని గుర్తించే ఫీచర్ ఉంది. ఇది ఎవరైనా పడిపోతుంటే గుర్తిస్తుంది. నిమిషం దాటినా వ్యక్తి కదలకపోతే దానంతటదే అత్యవసర నంబరుకు ఫోన్ చేస్తుంది.