Artist amazing woodwork : చెక్కపై అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్ట్ వీడియో వైరల్
చెక్కతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేసే ఆర్టిస్టులు కోకొల్లలు. అయితే ఒక గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెక్కాడు ఓ ఆర్టిస్టు . అతని ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
- Lakshmi 10tv
- Published On : June 7, 2023 / 05:59 PM IST
Artist amazing woodwork
Viral Video : చెక్క మీద బొమ్మలు చెక్కడం పురాతన కళారూపాలలో ఒకటి. ఈ కళ ఈజిప్షియన్ హైరోగ్లిఫ్‌లు కనుగొన్నారు. భారతదేశంలో కూడా ఎంతోమంది కళాకారులు చెక్కపై రాజభవనాలు, విగ్రహాలు వంటి వాటికి రూపం ఇచ్చారు. అయితే తాజాగా ఓ ఆర్టిస్ట్ చెక్కపై గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తూ చెక్కిన కళారూపం ఔరా అనిపిస్తోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Tansu YEĞEN అనే ట్విట్టర్ యూజర్ చెక్కతో చేసిన కళాఖండాన్ని చూపించే వీడియో ఒకటి షేర్ చేశారు. ‘అద్భుతమైన కళ’ అనే శీర్షికతో ఆయన పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ కళాఖండం గ్రామీణ జీవితం ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టి చూపించింది. ఈ వీడియోలో ఉన్న ఆర్టిస్ట్ ఎవరూ ఏంటనే వివరాలు తెలియదు కానీ చూసినవారు కళాకారుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు.
‘నేను ఇప్పటివరకూ చూసిన చక్కని విషయాల్లో ఒకటి.. దీనిని తయారు చేయడం చాలా కష్టం’ అని ఒకరు.. ‘ఓ కళాకారుడిగా ఈ వ్యక్తి ప్రతిభను చూసి మరింత స్ఫూర్తి పొందుతున్నాను’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో అద్భుతమైన కళలు, కళాకారులు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు.
Brilliant art… pic.twitter.com/14bgMcTbgB
— Tansu YEĞEN (@TansuYegen) June 6, 2023
