Sarangi player : రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఆర్టిస్ట్.. జానపద కళాకారుల పరిస్థితిని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

ఇటీవల కాలంలో ఎంతోమంది జానపద కళాకారులు జీవనోపాధిని కోల్పోయారు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా ఆదరణ లేక .. తమ కళను వదిలిపెట్టలేక అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఓ కళాకారుడి పరిస్థితి చూసి దేశంలో జానపద కళాకారుల దుస్థితిని ప్రశ్నిస్తున్న నెటిజన్లు.

Sarangi player : రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఆర్టిస్ట్.. జానపద కళాకారుల పరిస్థితిని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

Viral Video

Viral Video : ఎన్నో జానపద కళలు మరుగున పడిపోతున్నాయి. ఎంతో మంది కళాకారులకు సరైన గుర్తింపు లేక అవస్థలు పడుతున్నారు. కళకే అంకితం అయిన వారు తమ కళను భిక్షాటనకు ఉపయోగించడం మనసుని కదిలిస్తోంది. రీసెంట్ గా రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఓ కళాకారుడి వీడియో వైరల్ అవుతోంది.

Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి

భారతదేశంలో ఎంతోమంది జానపద కళకారులు ఉన్నారు. అయితే వారికి ఆయా రాష్ట్రాల నుంచి సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది గాయకులు, నృత్యకారులు వేదికలపై ప్రదర్శనలు ఇవ్వవలసి వస్తోంది. ఇక జీవనోపాధి లేని పక్షంలో భిక్షాటన చేయాల్సిన దుస్థితి కలుగుతోంది. రీసెంట్‌గా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకురాలు అశ్వినీ భిడే దేశ్ తీసిన వీడియో వారి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ వీడియోలో ఓ సంగీత కారుడు రోడ్డుపై సారంగి వాయిస్తూ కనిపిస్తాడు. వీడియో రికార్డింగ్ సమయంలో అశ్వినీ భిడే సారంగికి శ్రావ్యమైన రాగాలను పాడారు. AMIT ANAND BIVALKAR అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు.

World Piano Day 2023 : ”పియానో డే” ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా.. పియానోతో అమృతం ఒలికించిన తెలుగు సంగీత దర్శకులు వీరే..

AMIT ANAND BIVALKAR  ‘ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అశ్వినీ భిడే తీసిన వీడియో. సారంగికి తన శ్రావ్యమైన గళాన్ని అందించారు. ఈ వీడియోను మీరందరూ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన చెందారు. దేశంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటున్నారని వాపోయారు. ఆ కళాకారుడికి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే అతని కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.