World Piano Day 2023 : ”పియానో డే” ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా.. పియానోతో అమృతం ఒలికించిన తెలుగు సంగీత దర్శకులు వీరే..

మార్చి 29 వరల్డ్ పియానో డే. సంవత్సరం మొదలైన 88వ రోజున ఈ డేని జరుపుతారు. అసలు పియానోని ఎవరు కనిపెట్టారు? ఎవరు ఈ డేని సెలబ్రేట్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? తెలుసుకుందాం.

World Piano Day 2023 : ”పియానో డే” ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా.. పియానోతో అమృతం ఒలికించిన తెలుగు సంగీత దర్శకులు వీరే..

World Piano Day 2023

World Piano Day 2023 : సంగీతం వింటే మనసుకి ఉపశమనం దొరుకుతుంది. ఎక్కడలేని శక్తి వస్తుంది. అప్పటిదాకా మూడ్ ఆఫ్ లో ఉన్నవారు సైతం హుషారైపోతారు. ఇక సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇక విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో ఒక ”డే” ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. అయితే వాటిని జరపుకోవడం వెనుక కథా కమామీషు తెలుసుకోవడం కూడా ఎంతైనా అవసరం. ఈరోజు ‘వరల్డ్ పియానో డే’ (World Piano Day). అసలు పియానోని (Piano) ఎవరు కనిపెట్టారు? ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? తెలుసుకుందాం.

Film Writer Veena Pani : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’కి ఘన సన్మానం

పియానో అద్భుతమైన సంగీత వాయిద్య పరికరం. కీబోర్డు (Key Board) ద్వారా పియానో వాయిస్తే అందులోని హెమ్మర్లు (hammer ) తీగలకు తగిలి అద్భుతమైన సంగీతం వస్తుంది. ఈ వాయిద్యాన్ని 1700 సంవత్సరంలో ‘బార్టోలోమియో క్రిస్టోఫోరి’ (Bartolomeo Cristofori) కనిపెట్టాడు. ఆయన తదనంతరం జర్మన్ పియానిస్ట్ ‘నిల్స్ ఫ్రాహ్మ్’ ( Nils Frahm) పియానోని మరింత సంస్కరించాడు. పాత పరికరానికి ఆధునికతను జోడించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఇక ఆయనతో పాటు మరికొంతమంది పియానో లవర్స్ కి ‘ పియానో డే’ జరపాలనే ఆలోచన వచ్చింది. పియానో డేని సంవత్సరం మొదలైన 88వ రోజు జరపాలని నిర్ణయించారు. అలా మార్చి 29న ‘వరల్డ్ పియానో డే’ గా నిర్ణయించారు.

‘White House of Regent Park’ : కాసులు కురిపిస్తున్నప్రపంచంలోనే అత్యంత పురాతన భవనం, ధర రూ.2480 కోట్లు..!!

చాలా తెలుగు సినిమాల్లో పియానో కనిపిస్తుంది. హీరో లేదా హీరోయిన్లు పియానో వాయిస్తూ వచ్చిన తెలుగు పాటలు చాలానే ఉన్నాయి. అలాగే మన తెలుగు సంగీత దర్శకుల్లో ఇళయరాజా (ilayaraja), కోటి (koti), మణిశర్మ(mani sharma), ఎ.ఆర్.రెహమాన్(ar rahman) వంటి వారు పియానో వాయించడమే కాదు తమ పాటల్లో సైతం ఈ పరికరానికి ప్రాముఖ్యతను ఇస్తారు. అలా వారు పియానోతో వాయించిన ఎన్నో పాటలు అద్భుతంగా వచ్చాయి.

ఇటీవల కాలంలో సంగీతానికి ఆదరణ బాగా పెరిగిందనే చెప్పాలి. చాలామంది పేరెంట్స్(parents) తమ పిల్లలకి ఏదో ఒక ఇన్ట్రుమెంట్(instrument) నేర్పించడానికి మొగ్గుచూపుతున్నారు. పిల్లలకు సంగీతం నేర్పించడం ద్వారా వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. కొత్త అంశాలు నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. వాళ్లలో క్రియేటివిటీ (creativity) పెరుగుతుంది. సో ఇలా పిల్లలు, పెద్దలే కాదు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సంగీతాన్ని వినడానికి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో సంగీతానికి ఆదరణ పెరిగిందనే చెప్పాలి. ఈరోజు ”పియానో డే’ జరుపుకుంటున్న పియానో శిక్షకులు మరియు పియానో లవర్స్ అందరికీ శుభాకాంక్షలు.