‘White House of Regent Park’ : కాసులు కురిపిస్తున్నప్రపంచంలోనే అత్యంత పురాతన భవనం, ధర రూ.2480 కోట్లు..!!

కాసులు కురిపిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనం, (‘White House of Regent Park’) ధర రూ.2480 కోట్లు..ఇప్పటి వరకు ఎంతోమంది చేతులు మారిన ఈ 205 ఏళ్లనాటి భవనం కొన్న ప్రతీవారికి కాలుసులు కురిపిస్తోంది. అమ్మాకానికి వచ్చిన ప్రతీసారి దర రెట్టింపు అవుతోంది.

‘White House of Regent Park’ : కాసులు కురిపిస్తున్నప్రపంచంలోనే అత్యంత పురాతన భవనం, ధర రూ.2480 కోట్లు..!!

‘White House of Regent Park’ In london

‘White House of Regent Park’ : అమెరికా (US)అధ్యక్ష భవనం వైట్ హౌస్ (White House)లాంటి భవనం. చూడటానికి అచ్చం వైట్ హౌస్ లానే ఉంటుంది. పైగా ఈ భవనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది. దగ్రేట్ బ్రిటన్ రాజధాని లండన్ (London) లో ఉన్న ఈ భవనం పేరు ‘వైట్‌ హౌస్‌ ఆఫ్‌ రీజెంట్స్‌ పార్క్‌’ (‘White House of Regent Park’).. రెండు అంతస్తులుండే ఈ భవనంలో 40 బెడ్ రూమ్స్ (40 Bed rooms) ఉన్నాయి. 205 ఏళ్ల నాటి ఈ భవనం అమ్మకానికి రావటంతో దాన్ని సొంతం చేసుకోవటానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది చేతులు మారిన ఈ భవనం మరోసారి అమ్మకానికి రెడీగా ఉంది. దీంతో దీన్ని సొంతం చేసుకోవటానికి చాలామంది పోటీపడుతున్నారు.

జార్జియాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి జేమ్స్‌ బుర్టన్‌ 1818లో నిర్మించిన ఈ భవనం ఇప్పటి వరకు ఎన్నో చేతులు మారింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన భవనంగా పేరొందిన ఈ భవనం తాజాగా మరోసారి అమ్మకానికి వచ్చింది. దీని ధర భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. ఇది అమెరికా అధ్యక్షభవనంలా ఉండటంతో దీన్ని ‘వైట్‌ హౌస్‌ ఆఫ్‌ రీజెంట్స్‌ పార్క్‌’ అని పిలుస్తుంటారు.

205 ఏళ్లనాటి భవనం లోపల 40 బెడ్ రూములు, 8 గ్యారేజీలు, టెన్నిస్‌ కోర్టు, ఆవిరి స్నానం (Steam bath) కోసం ఓ ప్రత్యేక రూమ్ ఉన్నాయి. ఓ లైబ్రరీ కూడా ఉంది. అతిపెద్ద డైనింగ్‌ రూమ్‌ వంటి సౌకర్యాలున్నాయి. మొత్తం 29 వేల చదరపు అడుగుల లివింగ్‌ స్పేస్‌ ఉంది. జేమ్స్‌ బుర్టన్‌ 1818లో ఈ రెండంస్థుల భవనాన్ని నిర్మించిన జేమ్స్‌ బుర్టన్‌ తన కుటుంబ సభ్యులతో నివసించేవారు. తరువాత ఇది బెడ్ ఫోర్ట్ కాలేజీగా మార్చబడింంది. అనేక దశాబ్దాల పాటు అందులో కాలేజీ నిర్వహించబడింది. తరువాత 1980లో తిరిగి ఓ ప్రైవేట్ నివాసంగా మారింది. అప్పటినుంచి చేతులు మారుతు వస్తోంది. ఇది అమ్మానికి పెట్టిన ప్రతీసారి ఈ భవనం ధర రెట్టింపు అవుతు వస్తోంది. తాజాగా ఇది భారత కరెన్సీ ప్రకారం రూ.2480 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన భవనం ఇదేనని చెబుతున్నారు.

ఈ భవనాన్ని భారీ ధరకు కొనుగోలు చేసినవారంతా ఆ అప్పులు తీర్చటానికి తిరిగి ఈ భవనాన్ని మరింత ఎక్కువ ధరకు అమ్ముతూ వచ్చారు. అలా దాని రేటు పెరుగుతూ వస్తోంది. చాలామంది పోటీ పడి ఈ భవనాన్ని కొంటారు కానీ దీంట్లో నివసించటానికి ఉపయోగించరు. కేవలం పెట్టుబడిగా మాత్రమే చూస్తూ దీన్ని కొంటారు. తిరిగి రెట్టింపు ధరకు అమ్ముతుంటారు. అలా ఈ భవనానికి ధర పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించే ఈ భవనం మరోసారి అమ్మకానికి సిద్ధంగా ఉంది.