Old Man Married To Girlfriend: ప్రేమంటే అంతేమరి..! 93ఏళ్ల వయస్సులో ప్రియురాలిని పెళ్లాడిని వ్యోమగామి
ఆల్డ్రిన్కు అంకాఫార్తో నాలుగో వివాహం. అంతకుముందు మూడు వివాహాలు చేసుకున్నాడు. ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. ఐదు దశాబ్దాల కిందట అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపిన అపోలో-11 నౌక ద్వారా చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యక్తి ఆల్డ్రిన్. అప్పట్లో చంద్రుడిపై కాలుమోపిన ముగ్గురు వ్యోమగాముల్లో నేటికీ బతికున్న ఏకైక వ్యక్తి ఆల్డ్రినే.
- Harish Thanniru
- Updated on- January 22, 2023 / 10:06 AM IST
Old Man Married
Old Man Married To Girlfriend: ఐదు దశాబ్దాల క్రితం చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన బజ్ ఆల్డ్రిన్ పేరు అందరికీ సుపరిచితమే. అప్పట్లో చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టించిన ఆయన తన 93వ పుట్టిన రోజున ప్రేయసిని పెళ్లిచేసుకొని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాద్వారా తెలుపుతూ.. టీనేజ్‌లో లేచిపోయినంత ఉత్సాహంగా ఉందంటూ పేర్కొన్నాడు. డాక్టర్ అంకా ఫార్‌తో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నానని, ఇప్పుడు ప్రేమను పెళ్లిగా మార్చుకున్నానని బజ్ ఆల్డ్రిన్ తెలిపాడు.
Old Couple Marriage : 35 ఏళ్ల ప్రేమ..65ఏళ్ల వయస్సులో ఒక్కటైన జంట
డాక్టర్ అంకాఫార్, ఆల్డ్రిన్ సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. అంకా వయస్సు సుమారు 55ఏళ్లు ఉంటుంది. తనకంటే దాదాపు 35ఏళ్ల చిన్నవయస్సు కలిగిన మహిళను ఆల్డ్రిన్ వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నా 93వ పుట్టిన రోజున లివింగ్ లెజెండ్స్ ఆఫ్ ఏవియేషన్‌గా గౌరవం పొందుతున్న రోజున నా చిరకాల ప్రేయసి డాక్టర్ అంకాఫార్, నేను పెళ్లి చేసుకున్నట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నానని ఆల్డ్రిన్ తెలిపాడు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన వేడుకలో వీరిద్దరు పవిత్రబంధంతో ఒక్కటయ్యారు.
Old Age Love Marriage : 21 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల మహిళ లవ్ ఎఫైర్
ఆల్డ్రిన్కు అంకాఫార్తో నాలుగో వివాహం. అంతకుముందు మూడు వివాహాలు చేసుకున్నాడు. ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. ఐదు దశాబ్దాల కిందట అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపిన అపోలో-11 నౌక ద్వారా చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యక్తి ఆల్డ్రిన్. అప్పట్లో చంద్రుడిపై కాలుమోపిన ముగ్గురు వ్యోమగాముల్లో నేటికీ బతికున్న ఏకైక వ్యక్తి ఆల్డ్రినే. లివింగ్ లెజెండగా కీర్తి అందుకున్న ఆయన 93ఏళ్ల వయసులో ఉత్సాహంగా పెళ్లి చేసుకున్నాడు.
