ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించగా..దావానలం పూర్తిగా చల్లార్చే దారి కన్పించక ప్రస్తుతం ఆస్ట్రేలియా బిక్కుబిక్కుమంటోంది..
అడవుల్లో రగిలిన కార్చిచ్చు ఆస్ట్రేలియాని గడగడలాడిస్తోంది.. పాతికమందిని పొట్టనబెట్టుకున్న ఈ దావానలం..లక్షలాది వన్యప్రాణులను మంటల్లో దగ్ధం చేసింది. కంగారూలకు ప్రసిద్ధి అయిన ఆస్ట్రేలియాలో ఇప్పుడు చనిపోయిన వీటి కళేబరాలు కన్నీరు పెట్టిస్తున్నాయ్.
ఆగ్నేయ ప్రాంతంలో 2019 సెప్టెంబర్ 23న మొదలైన ఈ చిచ్చు ఇన్ని రోజులపాటు కొనసాగడం ఆస్ట్రేలియా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..వేడిగాలుల ధాటికి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిపోయాయ్. దీంతో సామాన్యులతో పాటు సెలబ్రెటీల వరకూ ఈ మంటలను అదుపు చేసేందుకు తమ వంతుగా ముందుకు వస్తున్నారు..
మంటలను అదుపు చేయడానికి ప్రభుత్వం 3,000 మంది సైనికులను రంగంలో దింపింది. ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంటలను ఆర్పడానికి సహకరిస్తున్నారు. ఐతే కార్చిచ్చుతో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో సిడ్నీ సిటీతో పాటు..ఇతర నగరాల్లోనూ పవర్ కట్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయ్.
న్యూసౌత్ వేల్స్. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించగా, న్యూసౌత్ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చు ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పర్యటిస్తున్నారు
ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ విపత్తు కారణంగానే స్కాట్ మోరిసన్ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి 13 నుంచి 4 రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించాల్సి ఉంది. మరోవైపు ఆసీస్ మంటల ధాటికి పొరుగున న్యూజిలాండ్ దేశంలోని ఆకాశం ఎర్రగా మారుతుందంటే ఇక్కడి సిచ్యుయేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తీరప్రాంతంలో ఎగసిపడుతున్న మంటలు..పొగ ధాటికి 2వేల కిలోమీటర్ల మేర
మరోవైపు ప్రఖ్యాత గాలపోగస్ దీవుల్లోని ప్రాణులు కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చుకి మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.. ఎప్పుడో డార్విన్ కాలంనాటి ఎన్నో అరుదైన జాతులకు చెందిన జీవజాలాన్ని ఇక్కడ భద్రపరుస్తున్నారు. ఇప్పటికే వేలాది కోలస్, కంగారూలు మంటల వేడికి చనిపోగా..మిగిలిన ఉన్న వాటి సంరక్షణ ఎలా చేయాలో తెలీక పర్యావరణవేత్తలు..జీవశాస్త్రజ్ఞులు మదనపడుతున్నారు. ఆదివారం(జనవరి 05,2020) కొంతసేపు వర్షం పడటంతో మంటలు కాస్త చల్లారాయి. ఐతే ఇప్పటికిప్పుడు పరిస్థితి చక్కబడే అవకాశమైతే కన్పించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు స్థానిక ప్రజల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం దావానలాన్ని చల్లార్చే పనిలో పడింది.