Ayatollah Ali Khamenei Funeral: అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. వారం రోజుల అంతిమయాత్ర.. తదుపరి పరిణామాలపై ఉత్కంఠ
ఖమేనీ(Ayatollah Ali Khamenei Funeral) అంత్యక్రియల ప్రక్రియ జులై 2026లో అత్యంత భారీ స్థాయిలో వారం రోజుల పాటు సాగింది.
- V Santhosh Kumar
- Published on- July 9, 2026 / 07:35 PM IST
Ayatollah Ali Khamenei funeral rites of have been completed
- ముగిసిన ఖమేనీ అంత్యక్రియలు
- లక్షలాది మంది వీడ్కోలు
- హాజరైన ఇరాన్ నాయకులు
Ayatollah Ali Khamenei Funeral: అయాతొల్లా అలీ ఖమేనీ.. ఇరాన్ దేశాన్ని సుమారు 36 సంవత్సరాల పాటు ఉక్కుపిడికిలితో పాలించిన సుప్రీం లీడర్. ఆయన ఫిబ్రవరి 28, 2026న మరణించిన విషయం తెలిసిందే. అమెరికాతో జరిగిన వార్ లో ఖమేనీ మరణించారు. ఇటీవలే ఆయన అంత్యక్రియలు జరిగిన. ఈనేపథ్యంలోనే ఆయన మరణం, దాని తదుపరి పరిణామాలు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి.
మరణానికి కారణం, తదుపరి పరిణామాలు:
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఉమ్మడిగా ఇరాన్‌పై జరిపిన భారీ వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei Funeral) ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్‌లోని ఆయన నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జెట్ విమానాలు జరిపిన క్షిపణి దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు కూడా మరణించారు. ఆయన మరణ వార్తను మార్చి 1న ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఇరాన్ పౌరులలో ఈ ఘటనపై భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోగా, మరికొందరు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
అంత్యక్రియలు, హాజరైన ప్రముఖులు:
ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ జులై 2026లో అత్యంత భారీ స్థాయిలో వారం రోజుల పాటు సాగింది. టెహ్రాన్‌లో భారీ ఊరేగింపు అనంతరం, ఆయన భౌతికకాయాన్ని పొరుగు దేశమైన ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలించారు. అక్కడ లక్షలాది మంది ప్రజలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల ఊరేగింపులలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ (IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీతో పాటు ఇరాక్ రాజకీయ, మత పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఇరాన్‌లోని పవిత్ర నగరమైన మష్హాద్‌కు తరలించి ఇమామ్ రెజా మసీదు వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు.
