×
Ad

క్షణాల వ్యవధిలో ఆ 50 మందిని చంపేసింది ఈ ఇద్దరు అమ్మాయిలే..

ఆ ఇద్దరు యువతుల ఫొటోలను బీఎల్‌ఏ విడుదల చేసి పలు వివరాలు తెలిపింది.

The woman attackers (Image Credit To Original Source)

  • పాకిస్థాన్‌లో ఇటీవల ఆత్మాహుతి దాడులు
  • బాధ్యతవహిస్తూ బీఎల్‌ఏ ప్రకటన
  • ఇద్దరు యువతుల ఫొటోలు విడుదల  

Baloch militant group: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు జరిపి దాదాపు 17 మంది భద్రతా సిబ్బంది సహా 50 మందిని చంపేసిన ఘటనపై బాధ్యతవహిస్తూ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటన చేసింది. ఆత్మాహుతి దాడి చేసిన ఇద్దరి ఫొటోలను విడుదల చేసింది. వారిద్దరూ యువతులే కావడం గమనార్హం. వారిలో ఒకరి పేరు అసిఫా మెంగల్‌ (24).

బలూచిస్థాన్‌లోని నుష్కీ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్‌ కూతురు మెంగల్‌ అని బీఎల్‌ఏ వివరించింది. 2022, అక్టోబరు 2న జన్మించిన మెంగల్‌ తన 21వ పుట్టిన రోజున బీఎల్‌ఏకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌లో చేరింది. 2024 జనవరిలో ఫిదాయీ (సూసైడ్ అటాకర్‌)గా మారాలని నిర్ణయం తీసుకుంది.

ఫిదాయీ ఒక అరబిక్ పదం. దీనికి “త్యాగం చేసేవారు” అని అర్థం కూడా ఉంది. శనివారం నుష్కీలోని ఐఎస్‌ఐ హెడ్‌ క్వార్టర్స్‌పై ఆత్మాహుడి దాడి చేసింది అసిఫా మెంగలేనని బీఎల్‌ఏ ప్రకటిచింది.

Also Read: ఏపీలోని రాక్షస పాలనలో దహనకాండ అంటూ చంద్రబాబు, లోకేశ్‌కు ముద్రగడ లేఖ

మరో యువతికి సంబంధించిన వివరాలను బీఎల్‌ఏ తెలపలేదు. ఆమెకు సంబంధించిన ఓ వీడియో మాత్రం బయటకు వచ్చింది. “అణచివేతకు గురవుతున్న మన తల్లులు, సోదరీమణుల మీదే పాకిస్థాన్‌ ప్రభుత్వం బల ప్రయోగం చేస్తోంది, నేరుగా మాతో పోరాడలేకపోతోంది. మనం మేల్కోవాలి. బలూచ్‌ జాతి మేల్కోవాల్సిన అవసరం ఉంది.

బలూచ్‌ స్వాతంత్ర్య పోరాట యోధులతో కలిసి ఐక్యంగా పనిచేయాలి. మన శత్రువులకు రోజులు దగ్గర పడ్డాయి. వారికి అంతగా బలం లేదు. శత్రువులతో రాజీపడే అవకాశమే లేదని బలూచ్ జాతి అర్థం చేసుకోవాలి. మన యోధులు వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు. అయినప్పటికీ, అతి తక్కువ డబ్బుకి ఆశపడి మనలో కొందరు శత్రువులకు గూడఛారులుగా పనిచేస్తున్నారు” అని ఆ యువతి చెప్పింది. ఆ సమయంలో ఆమె భారీ తుపాకీని చేతిలో పట్టుకుని ఉంది.

కాగా, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడులకు ప్రతిగా పాకిస్థాన్ ఆర్మీ 40 గంటలు ఆపరేషన్ జరిపి ఇప్పటివరకు 140 మంది మిలిటెంట్లను హతమార్చింది.